Raksha Bandhan 2024: 30వ సారి ప్రధాని మోడీకి రాఖీ కట్టనున్న పాకిస్థానీ మహిళ
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కమర్ షేక్ ప్రధాని మోదీకి 8-10 రాఖీలు కట్టడానికి రెడీ అయ్యారు. నేను మార్కెట్ నుండి రాఖీని కొనుగోలు చేయనని, ప్రతి సంవత్సరం రక్షాబంధన్‌కి ముందు నా చేతులతో రాఖీలు తయారు చేస్తానని ఆమె అన్నారు.
- By Praveen Aluthuru Published Date - 10:46 AM, Mon - 12 August 24

Raksha Bandhan 2024: గత 29 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీని సోదరుడిగా భావించి ఆయనకు రాఖీ కట్టిన ఖమర్ షేక్.. మరోసారి రక్షాబంధన్ రోజున ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కమర్ షేక్ ప్రధాని మోదీకి రాఖీ కట్టడం ఇది వరుసగా 30వ రక్షాబంధన్.
కమర్ షేక్ పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఖమర్ షేక్ 1981 సంవత్సరంలో మొహ్సిన్ షేక్‌ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమె భారతదేశంలో స్థిరపడింది. ఖమర్ షేక్ 1990 సంవత్సరం నుండి అంటే గత 35 సంవత్సరాలుగా ప్రధాని మోడీతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆమె మోడీని తన సోదరుడిగా భావిస్తారు. మోడీ కూడా ఆమెను సొంత సోదరిగా భావిస్తాడు. అయితే రక్షాబంధన్ పండుగను దృష్టిలో ఉంచుకుని కమర్ షేక్ తన చేతులతో ప్రధాని మోదీకి ప్రతి ఏడాది రాఖీ కట్టేవారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కమర్ షేక్ ప్రధాని మోదీకి 8-10 రాఖీలు కట్టడానికి రెడీ అయ్యారు. నేను మార్కెట్ నుండి రాఖీని కొనుగోలు చేయనని, ప్రతి సంవత్సరం రక్షాబంధన్‌కి ముందు నా చేతులతో రాఖీలు తయారు చేస్తానని ఆమె అన్నారు. ఈసారి 30వ ఏట ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు సిద్ధమవుతున్న ఖమర్ షేక్.. ఈ ఏడాది నేను ప్రధాని మోదీకి కట్టబోయే రాఖీని వెల్వెట్‌పై తయారు చేశానని చెప్పారు. రాఖీలో ముత్యాలు, మోతీ, జర్దోసీ, టిక్కీలను ఉపయోగిస్తారు. రక్షాబంధన్‌కు ఒకరోజు ముందు ఆగస్టు 18న రాఖీ కట్టేందుకు ఆమె ఇప్పటికే ఢిల్లీకి టికెట్ తీసుకున్నారు.
కరోనా వరకు తాను ప్రధాన మంత్రికి రాఖీ కట్టానని, అయితే 2020, 2021, 2022 సంవత్సరాలలో కరోనా వల్ల తాను ప్రధాన మంత్రి మోడీకి రాఖీ కట్టలేకపోయానని చెప్పింది. గతేడాది ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు ఆమె తన భర్త మొహసిన్ షేక్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రక్షాబంధన్ రోజున తనకు ఆహ్వానం అందుతుందని ఖమర్ షేక్ భావిస్తున్నారు. ఒక సోదరిగా కమర్ షేక్ ఈ సంవత్సరం కూడా తన సోదరుడు నరేంద్ర మోడీ మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు. గత పదేళ్లుగా ప్రధాని మోదీ ప్రజా ప్రయోజనాలను ఎలా కొనసాగిస్తున్నారో అలాగే కొనసాగిస్తారని కూడా ఆమె చెప్పారు.
పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించిన కమర్ షేక్ మరియు పీఎం నరేంద్ర మోదీ మధ్య ఉన్న అన్నదమ్ముల అనుబంధం గురించి కమర్ షేక్ మాట్లాడుతూ 1990లో గవర్నర్‌గా ఉన్న దివంగత డాక్టర్ స్వరూప్ సింగ్ ద్వారా తొలిసారిగా ప్రధాని మోదీని కలిశానని చెప్పారు. డాక్టర్ స్వరూప్ సింగ్ విమానాశ్రయం నుండి బయలుదేరినప్పుడు కలవడానికి వెళ్లగా నరేంద్ర మోడీ కూడా అక్కడే ఉన్నారని ఆమె చెప్పింది. కమర్ షేక్ తన కూతురేనని స్వరూప్ సింగ్ అప్పుడు నరేంద్ర మోడీకి చెప్పాడు. ఇది విన్న నరేంద్ర మోడీ ఈ రోజు నుండి కమర్ షేక్ నా సోదరి అని అన్నారు. అప్పటి నుంచి రక్షాబంధన్ పండుగ రోజున ఆయనకు రాఖీ కడుతున్నానని తెలిపింది. .
తాను ప్రధాని మోదీని కలిసినప్పుడు తాను సంఘ్ కార్యకర్త మాత్రమేనని చెప్పారు. అప్పుడు ఆయనకు రాఖీ కట్టేటప్పుడు నేను ఒకసారి అన్నాను ఏదో ఒక రోజు మీరు గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇది విన్న ప్రధాని మోదీ చాలా నవ్వుకున్నారు. నా ప్రార్థన వాస్తవరూపం దాల్చినప్పుడు, అప్పుడు మోడీ ఇలా అడిగారట. ఎం కోరుకున్నావని అడగా, అప్పుడు మీరు ప్రధాని కావాలని కురుకున్నట్లు ఆమె చెప్పారు. అనుకున్నట్టే మోడీ మూడవసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.
Also Read: MLC Kavitha : ఇవాళ సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ