Viral Pic of Hijab: ఈ చిత్రం దేశ ఐక్యతకు స్ఫూర్తి!
కర్నాటక అంతటా హిజాబ్ వివాదం నెలకొంది. మొదట కర్నాటకే పరిమితమైన ఈ వివాదం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు పాకింది. కొందరు ‘హిజాబ్’ ను వ్యతిరేకిస్తే, మరికొందరు స్వాగతించారు.
- By Balu J Published Date - 01:57 PM, Thu - 24 February 22

కర్నాటక అంతటా హిజాబ్ వివాదం నెలకొంది. మొదట కర్నాటకే పరిమితమైన ఈ వివాదం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు పాకింది. కొందరు ‘హిజాబ్’ ను వ్యతిరేకిస్తే, మరికొందరు స్వాగతించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఓ ఫొటో ఎంతోమందిని ఆలోజింపచేస్తోంది. దేశవ్యాప్తంగా ఎందరినీ ఆకట్టుకుంది. హిజాబ్ వివాదం ముదురుతున్న సమయంలో ఈ చిత్రం దేశ యూనిటీకి చిహ్నంగా నిలుస్తోంది. గత పదిరోజుల క్రితం ఉడిపి గవర్నమెంట్ ప్రీ-యూనివర్సిటీ కాలేజ్ ఫర్ గర్ల్స్ వారం రోజుల పాటు మూసివేసింది. ఆ తర్వాత పున: ప్రారంభించినప్పుడు హిందు అమ్మాయిలతో ఓ మైనార్టీ స్టూడెంట్ కలిసి భుజాన బ్యాగులు వేసుకొని కళాశాలకు వెళ్తున్నారు. హిజాబ్ ధరించిన అమ్మాయికి రక్షణ కవచంగా నిలిచారు కొందరు. గట్టిగా చేతులు పట్టుకుని కళాశాల వైపు నడుస్తున్నట్లు ఈ చిత్రంలో చూడొచ్చు. ఇర్షాద్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్ అనిపించిన ఈ ఫొటో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
These girls are from Udupi,where it all started…
Little hope is alive for the generations to come…This is the real spirit of my India..In Unity,lies the Strength..#HizabRow pic.twitter.com/Msqc02Tddo— AV Jashwanthi Reddy (@AvJashwanthi) February 17, 2022
ಸರ್ವ ಜನಾಂಗದ ಶಾಂತಿಯ ತೋಟವಾದ ವಿಶ್ವ ಪ್ರಸಿದ್ಧ ಕನ್ನಡ ನಾಡಿನ ಭವ್ಯ ಪರಂಪರೆಗೆ ರಾಜಕೀಯ ಲಾಭಕ್ಕಾಗಿ ವಿಷ ಬೀಜ ಬಿತ್ತುವ @BJP4Karnataka ಕ್ಕೆ ನನ್ನ ಧಿಕ್ಕಾರವಿದೆ. pic.twitter.com/DGXKpfW0dj
— Abdul Majeed (@AbdulMajeedSDPI) February 18, 2022