HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Hamali Post Rs 60 Lakhs

Hamali Post: వామ్మో.. హమాలీ ఉద్యోగం రూ. 60 లక్షలు.. ఎక్కడంటే..?

మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ లో ఉన్న స్వదేశీ మద్యం (ఐఎంఎల్) డిపోలో హమాలీ ఉద్యోగం ఏకంగా రూ. 60. 10 లక్షలు పలికింది. హమాలీ సంఘం సభ్యులు ఒక పోస్టుకు వేలం నిర్వహించగా నలుగురు పోటీ పడ్డారు.

  • Author : Gopichand Date : 17-10-2022 - 3:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jpg
Jpg

సాఫ్ట్ వేర్ జాబ్ కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరుద్యోగులు లక్షల రూపాయలు కుమ్మరిస్తూ ఉంటారు. డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యోగాలు పొందుతూ ఉంటారు. రూ.లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలను డబ్బులతో కొనేస్తారు. లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలను డబ్బులు ఖర్చు పెట్టి సంపాదించుకునే విషయం ఒకవైపు ఉంచితే.. హమాలీ పనికి రూ.లక్షలు ఖర్చు పెట్టడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం చిన్నఘనపూర్‌లో చోటుచేసుకున్న ఈ వ్యవహారం షాక్‌కు గురి చేస్తోంది. స్థానికంగా ఉన్న ఐఎంఎఫ్‌ఎల్ మద్యం డిపోలో హమాలీ పోస్టుకు హమాలీ మజ్దూర్ యూనియన్ వేలం పాట నిర్వహించింది. ఈ వేలంపాట రసవత్తరంగా జరిగింది.

మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ లో ఉన్న స్వదేశీ మద్యం (ఐఎంఎల్) డిపోలో హమాలీ ఉద్యోగం ఏకంగా రూ. 60. 10 లక్షలు పలికింది. హమాలీ సంఘం సభ్యులు ఒక పోస్టుకు వేలం నిర్వహించగా నలుగురు పోటీ పడ్డారు. వీరిలో ఒకరు రూ. 60. 10 లక్షలకు వేలంపాడి పోస్ట్ దక్కించుకున్నారు. డిపోలో మద్యం సీసాల పెట్టెలు వాహనాలలో ఎక్కించడం, దించడం హమాలీ పని.

హమాలీ పనిలో కనీసం రూ.2500 నుంచి రూ. 5000 వరకు సంపాదించొచ్చు. ఈ డిపో నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలోని సుమారు 60 మద్యం దుకాణాలు, 12 బార్ అండ్ రెస్టారెంట్లకు మద్యం సరఫరా అవుతుంది. వివిధ మద్యం కంపెనీల నుంచి వచ్చిన మద్యం కాటన్లను గోదాములలోకి దిగుమతి చేసుకోవడం, గోదాముల నుంచి వైన్స్, రెస్టారెంట్లకు ఎగుమతి చేసేందుకు ఇక్కడ హమాలీలు పనిచేస్తారు. నాగం సతీశ్ అనే హమాలీ అనారోగ్యంతో పనిని మానేయడంతో దాని కోసం ఆదివారం వేలం నిర్వహించగా ఓ వ్యక్తి రూ.60.10 లక్షలు చెల్లించి కొనుగోలు చేసాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 60 Lakhs
  • Hamali post
  • Hamali Work
  • medak
  • telangana

Related News

Municipal Polling Counting

Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా మరియు పకడ్బందీగా సాగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే, తొలుత స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్‌లోకి తీసుకువస్తారు.

  • Revanth Meets Ramohan

    కేంద్రమంత్రి రామ్మోహన్‌తో సీఎం రేవంత్ భేటీ

  • CM Revanth Reddy meets PM Modi

    తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..

  • High Speed Internet For Eve

    రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం : తెలంగాణలోని ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్

  • New Ration Cards

    రేషన్ కార్డులు లేని వారికీ తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

Latest News

  • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

  • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

  • కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశం

  • రామ్‌చరణ్‌,ఉపాసన కవలల పేర్లు ఇవే!

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య యాత్ర కొనసాగిస్తున్న భార‌త్ జ‌ట్టు!

Trending News

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd