HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Good News For Chicken Lovers Meat Without Chicken

Cell Cultured Chicken: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. కోడి లేకుండానే చికెన్!

కోడిని కోయ‌కుండానే.. ర‌క్తం చింద‌కుండానే.. కోడి మాంసం అందుబాటులోకి వ‌స్తుంది.

  • Author : Balu J Date : 31-01-2023 - 12:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiken
Chiken

మనుషుల అవసరాలు పెరుగుతున్నాయి. దానికి తగ్గటే ఆవిష్కరణలు సైతం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అయితే కోడిని కోయ‌కుండానే.. ర‌క్తం చింద‌కుండానే.. కోడి మాంసం అందుబాటులోకి వ‌స్తుంది.. అదీ బోన్‌లెస్‌గా. ఈ మాంసంలో కొవ్వు త‌క్కువ‌.. కావ్సాల్సిన స్థాయిలో ప్రొటీన్లు, విట‌మిన్లు ఉంటాయి. ఈ కోడి మాంసం మాంసాహార ప్రియులకే కాదు.. శాఖాహారులకు, వివిధ కారణాలతో మాంసం తినడం మానేసిన, మానాలనుకునే వారికి ఒక‌ ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. సెల్ క‌ల్చ‌ర్డ్ చికెన్‌… ఇది సెల్‌ కల్చర్డ్‌ చికెన్‌. ప్రతి 18–24 గంటలకు రెట్టింపయ్యే కణాల ద్వారా మాంసం (సెల్‌ కల్చర్డ్‌ చికెన్‌) ఉత్పత్తి చేస్తారు. జంతు కణాల నుంచి ఉత్పత్తి చేసే ఈ సెల్‌ కల్చర్డ్‌ చికెన్‌ త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. కృత్రిమంగా పండిస్తున్న ఈ కోడి మాంసం తినడానికి ఎంతో సురక్షితమని అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఎ) ఇటీవల ధ్రువీకరించింది. ఎఫ్‌డీఎ అనుమతితో అమెరికాలో అప్‌సైడ్‌ ఫుడ్స్‌ అనే సంస్థ ఈ సెల్‌ కల్చర్డ్‌ చికెన్‌ను ఉత్పత్తి చేస్తోంది. పలు స్టార్టప్‌ ఫుడ్‌ కంపెనీలు ఈ తరహా మాంసం ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నాయి. భవిష్యత్‌లో మాంసం మార్కెట్‌లో కల్చర్డ్‌ మాంసం ఉత్పత్తులు సింహభాగాన్ని ఆక్రమిస్తాయని, ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయ‌ని చెబుతున్నారు.

ఇప్పటికే చంపబడిన జంతువుల నుంచి తయారు చేసే క్లీన్‌ మీట్‌కు సింగపూర్‌ రెగ్యులేటరీ ఆమోదం తెలిపింది. తొలిసారి నగ్గెట్స్‌ రూపంలో మాంసపు ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. కణం నుంచి ఉత్పత్తి అయ్యే ఈ కల్చర్డ్‌ చికెన్‌లో ఒక్క చుక్క యాంటీబయాటిక్స్‌ ఉపయోగించరు. దీనినే సెల్యులార్‌ వ్యవసాయం అని పిలుస్తున్నారు. సెల్‌ కల్చర్డ్‌ మాంసాన్ని సృష్టించే ప్రక్రియ ఒక కణంతో మొదలవుతుంది. ఒక కోడి నుండి బయాప్సీ ద్వారా కణాలను వేరు చేసి సెల్‌ బ్యాంక్‌ రూపొందిస్తారు. వాటిని ఉక్కు పాత్రలో పరిపక్వం చేస్తారు. పూర్తిస్థాయిలో చికెన్‌ తయారవడానికి కనీసం 14 రోజులు సమయం పడుతుంది.

ప్రస్తుతం ప్రతి 10 మంది అమెరికన్లలో ఒకరు కణాల ద్వారా తయారు చేసిన ఆహారం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్‌ పరిశోధన సంస్థ మింటెల్‌ అసోసియేట్ తెలిపింది. కోళ్లను వధించగా వెలువడే 10–12 శాతం గ్రీన్‌హౌస్, వాయు ఉద్గారాలకు ఈ సెల్‌ కల్చర్డ్‌ చికెన్‌ ద్వారా చెక్‌ పెట్టవచ్చంటోంది. కల్చర్డ్‌ లేదా మొక్కల ఆధారిత మాంసం ఉత్పత్తులకు భవిష్యత్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని, మాంసం మార్కెట్‌లో కనీసం 10 శాతం ఆక్రమిస్తుందని చెబుతున్నారు. ఈ కృత్రిమ చికెన్ ఈ ఏడాది పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోతుండ‌గా, 2028 నాటికి మ‌న దేశంలోనూ అందుబాటులోకి రానుంద‌ని చెబుతున్నారు.

Also Read: BCCI Prize Money: అండర్ – 19 విజేత కు బీసీసీఐ 5 కోట్ల నజరానా!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • Cell Cultured
  • chiken
  • meat

Related News

20 US States On Alert As Venomous Chinese Ant

Chinese Ant: అమెరికాలో చైనా చీమలు కుడితే ప్రాణాపాయం..

అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న చైనాకు చెందిన ‘ఏషియన్ నీడిల్ ఆంట్’ అనే ప్రమాదకరమైన చీమల జాతి గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చైనా మూలాలు కలిగిన ఈ ‘ఏషియన్ నీడిల్ ఆంట్స్’ ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా సుమారు 20 రాష్ట్రాలకు విస్తరించాయి. ఐదో వంతు అంగుళం పరిమాణంలో, ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండే ఈ

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd