HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Girls Suffer Sexual Abuse In Silence

Sexual Abuse: ష్.. గప్ చుప్..!

మహిళలు లైంగిక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది మౌన వేదనను అనుభవిస్తున్నారు.

  • Author : Balu J Date : 26-04-2022 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SI Kidnapped Up
Crime

‘నా వయసు 8. మా క్లాస్ లో అబ్బాయిలు తరచుగా టీజ్ చేస్తుండేవాళ్లు. ఓ సారి నా స్కర్ట్ ను లాగారు. దీంతో క్లాస్ టీచర్ కు చెప్పాను. ఆ అబ్బాయిలను తిట్టి వదిలేశారు. కానీ రెండు, మూడు రోజుల తర్వాత ఎప్పటిలాగే టీజ్ చేయడం మొదలుపెట్టారు. నేను ఈ విషయం మా అమ్మనాన్నకు చెప్పలేకపోయాను’ అంటోంది ఓ బాలిక.

***

 “నాకు 12 సంవత్సరాలు. మరో ముగ్గురు అమ్మాయిలతో బస్ స్టాప్ నుండి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా, అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి పట్టపగలు మా అందరినీ అనుచితంగా తాకాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ వ్యక్తిని మందలించే ప్రయత్నం చేయగా, నా తోటి స్నేహితురాలు వద్దని చెప్పింది. ఈ విషయం ఇంట్లో కూడా చెప్పకూడదని ఆంక్షలు విధించింది’’ అని అంటోంది మరో అమ్మాయి.

***

నా వయసు 14. కాలేజీ నుంచి ఇంటికొస్తున్న సమయంలో ఓ ఆకతాయి రోజు వెంబడించేవాడు. తప్పించుకునే ప్రయత్నం చేసినా వదిలిపెట్టలేదు. ఓ రోజు నేను మొదటి అంతస్తులో ఉన్న మా ఇంట్లోకి వెళ్తుండగా చూశాడు.  సెక్యురిటీ కళ్లు కప్పి రెండో అంతస్తు నుంచి ఇంట్లో చొరబడ్డాడు. నా దగ్గరకు వచ్చి ప్రైవేట్ పార్ట్స్ ను నొక్కాడు. సహాయం కోసం కేకలు వేసినా ఎవరూ ముందుకు రాలేదు. ఆ వ్యక్తి మళ్లీ వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ అదృష్టవశాత్తూ తప్పించుకున్నా. ఇదే విషయం ఇంటిపక్కల వాళ్లకు చెబితే నన్నే విమర్శించడం మొదలు పెట్టారు’’ అంటోంది తమన్నా అనే విద్యార్థిని.

***

ఈ ముగ్గురమ్మాయిలే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో యువతులు, విద్యార్థినులు, బాలికలు ఎంతోమంది మౌనంగా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఎవరికీ చెప్పుకోవాలో తెలియక లైంగికంగానూ, మానసికంగానూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై కొంతమంది బాధిత అమ్మాయిలు స్పందిస్తూ ఇలా చెప్పారు. ‘‘ఏదైనా పెద్ద ఘటన జరిగితేనే అసలు విషయాలు బయటకొస్తున్నాయి. కానీ చిన్న చిన్న విషయాలు ఏమాత్రం వెలుగుచూడటం లేదు. ఆకతాయిలు వేధిస్తున్నా మౌనంగా భరించాల్సి వస్తోంది. ఇంట్లో చెబితే ఆంక్షలు పెడతారేమోనని సైలంట్ ఉండాల్సి వస్తోంది’’ అని అంటోంది సుప్రియ (పేరు మార్చబడింది) అనే అమ్మాయి

చిన్న పిల్లల నుంచి వివాహితుల వరకు చాలామంది లైంగిక వేధింపులు ఫేస్ చేస్తున్నారు. కొంతమంది భయపడకుండా పోలీసులకు కంప్లైట్ చేస్తున్నారు. కానీ “హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేయడానికి మొబైల్ ఫోన్లు కూడా లేని మహిళల గురించి ఏమిటి? మహిళా పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ డ్యూటీలో ఎందుకు ఉండరు?” అని అంటోంది ప్రియాంక అనే (పేరు మార్చబడింది) కాలేజీ అమ్మాయి.  మహిళా భద్రత అధికారులను సంప్రదించేందుకు పదేపదే చేసిన ప్రయత్నాలు కూడా ఫలించడం లేదని, శివారు ప్రాంతాలు, ఐటీ సెక్టార్స్ లో షీటీమ్స్ క్రమం తప్పకుండా పెట్రోలింగ్ చేయాలని బాధిత అమ్మాయిలు కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dalit minor girl
  • harassed
  • hyderabad

Related News

Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అధికార కూటమిలో భాగం కాగా.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన పార్టీ సభ నిర్వహణకు పోలీసులు, హైకోర్టు అనుమతులు ఇవ్వకపోవడం.. అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో.. వాటన్

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

  • Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

    Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

Latest News

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd