HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Did You Know That Mysore Sandal Soap Has A Link With World War I

Mysore Sandal Soap: మైసూర్​ శాండిల్​ సబ్బు పుట్టుకకు వరల్డ్ వార్ 1తో లింక్.. ఏమిటది ?

గంధపు చెక్కలతో ఇంకా ఏమేం తయారు చేయొచ్చు ? అనే దానిపై మైసూరు మహారాజు(Mysore Sandal Soap) కసరత్తు చేశారు.

  • Author : Pasha Date : 26-05-2025 - 8:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mysore Sandal Soap World War I Maharaja Krishna Raja Wadiyar Iv

Mysore Sandal Soap: మైసూర్​ శాండిల్​ సబ్బు మనకు అందరికీ తెలుసు. మనలో చాలామంది ఈ సబ్బును వాడుతుంటారు. అయితే ఈ సబ్బు హిస్టరీ చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే వరల్డ్ వార్ -1 తోనూ దీనికి లింక్ ఉంది. ఆ సంగతేంటో తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.

Also Read :Human Bombs : ఉగ్రదాడులకు 20 మంది మానవబాంబులు ? ఎన్ఐఏ విచారణలో వెలుగులోకి

మైసూరు సంస్థానం .. గంధపు చెక్కలు

మొదటి ప్రపంచ యుద్ధం 1914 జులై 28 నుంచి 1918 నవంబరు 11 వరకు జరిగింది. ఈ యుద్ధం జరిగే సమయానికి మన భారతదేశానికి స్వాతంత్య్రం రాలేదు. అప్పటికి మనం బ్రిటీష్ పాలనలోనే ఉన్నాం. ఆ సమయానికి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతాన్ని వొడియార్ రాజవంశం పాలిస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలుకావడానికి ముందు వరకు మైసూరు సంస్థానం నుంచి విదేశాలకు పెద్దఎత్తున గంధపు చెక్కలు ఎగుమతి అయ్యేవి. యుద్ధం మొదలయ్యాక విదేశాల నుంచి మైసూరుకు ఆర్డర్లు ఆగిపోయాయి.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య అద్భుత ఐడియా

1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. దాని ఎఫెక్ట్ వల్ల  1916 నాటికి గంధపు చెక్కల కోసం విదేశీ ఆర్డర్లు ఆగిపోయాయి. దీంతో ఏం చేయాలి ? అనే దానిపై నాటి  మైసూరు మహారాజు కృష్ణ రాజ వొడియార్-​ 4 మేధోమధనం చేశారు.  ఈ సమయంలో ఆయనకు దివాన్​ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కీలక సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు 1916 మేలో ప్రభుత్వ శాండిల్​వుడ్​ ఆయిల్​ ఫ్యాక్టరీని మహారాజు కృష్ణ రాజ వొడియార్-​ 4 ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టరీలో శాండిల్​వుడ్​ నుంచి ఆయిల్​ని తీసేవారు. ఈప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలను దివాన్​ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకే మహారాజు అప్పగించారు.

Also Read :Monsoon Herald : ఈ ఆలయం రుతుపవనాల రాకను ముందే గుర్తించగలదు

కెమిస్ట్​ గారాలపూరి శాస్త్రిని ​ విశ్వేశ్వరయ్య కలిశాక.. 

గంధపు చెక్కలతో ఇంకా ఏమేం తయారు చేయొచ్చు ? అనే దానిపై మైసూరు మహారాజు(Mysore Sandal Soap) కసరత్తు చేశారు. ఈ తరుణంలో సబ్బులను తయారు చేయొచ్చని దివాన్ మోక్షగుండం ​ విశ్వేశ్వరయ్య సూచించారు. తదుపరిగా విశ్వేశ్వరయ్య సమక్షంలో బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సులో  సబ్బుల తయారీపై అనేక పరిశోధనలు జరిగాయి. బాంబే సహా అనేక ప్రాంతాల నుంచి నిపుణులను పిలిపించారు. ఈతరుణంలో ప్రముఖ కెమిస్ట్​ గారాలపూరి శాస్త్రి గురించి మోక్షగుండం ​ విశ్వేశ్వరయ్యకు తెలిసింది. దీంతో విశ్వేశ్వరయ్య వెళ్లి గారాలపూరి శాస్త్రిని కలిశారు. ఆయన సబ్బుల తయారీ ప్రక్రియ గురించి వివరించారు. తదుపరిగా గారాలపూరి శాస్త్రి ఇంగ్లాండ్​ సహా అనేక ప్రాంతాలను సందర్శించి, మరింత జ్ఞానాన్ని పెంచుకుని మైసూరుకు తిరిగొచ్చారు.  ఆ తర్వాత మైసూర్ శాండిల్ సబ్బు తయారీ దిశగా పనులు మొదలయ్యాయి.

1918లో మొదటి బ్యాచ్​ రెడీ 

శాండిల్​వుడ్​ ఆయిల్​ ఫ్యాక్టరీతో పాటు సబ్బు తయారీకి మరోక ఫ్యాక్టరీ ఏర్పడింది. ఎట్టకేలకు 1918లో మైసూర్​ శాండిల్​ సబ్బుకు సంబంధించిన మొదటి బ్యాచ్​ రెడీ అయ్యింది.తొలిసారిగా తయారు చేసిన మైసూర్ శాండిల్ సబ్బులను మైసూరు మహారాజు కృష్ణ రాజ వొడియార్-​ 4క బహుమతిగా ఇచ్చారు. అవి ఆయనకు బాగా నచ్చాయి. మైసూర్​ శాండిల్​ లోగో మీద ‘శరబ’ అని ఉంటుంది. సగం సింహం, సగం జింక, సగం పక్షి ఆకారంలో ఉండే ఈ శరబకు చాలా శక్తి ఉంటుందని అంటారు. 1980లో మైసూర్ శాండిల్ సబ్బు తయారీ ఫ్యాక్టరీ, ఆయిల్​ ఫ్యాక్టరీ విలీనం అయ్యాయి. దీంతో కర్ణాటక సోప్స్​ అండ్​ డిటర్జెంట్స్​ లిమిటెడ్​ (కేఎస్​డీఎల్​) అనే కంపెనీ ఏర్పడింది. ఇటీవలి కాలంలో శాండిల్​వుడ్​ లభ్యత గణనీయంగా పడిపోతోంది. అందుకే ‘గ్రో మోర్​ శాండిల్​వుడ్​’ అనే ప్రచారం చేస్తోంది కేఎస్​డీఎల్​.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • karnataka
  • Maharaja Krishna Raja Wadiyar IV
  • Mysore
  • Mysore kingdom
  • Mysore Sandal Soap
  • World War I

Related News

Spying Bird

జీపీఎస్ ట్రాకింగ్‌తో స‌ముద్ర ప‌క్షి.. చైనా ప‌నేనా?!

గతంలో నవంబర్ 2024లో కూడా కారువార్‌లోని బైత్‌కోల్ ఓడరేవు సమీపంలో ట్రాకింగ్ పరికరం అమర్చిన ఒక ‘వార్ ఈగిల్’ కనిపించింది. అప్పుడు కూడా లోతుగా దర్యాప్తు చేయగా అది వైల్డ్‌లైఫ్ రీసెర్చ్‌కు సంబంధించినదిగానే తేలింది.

  • Dog Temple

    కుక్కల కోసం ప్రత్యేక ఆలయం.. ఎక్కడ ఉందంటే?

  • Karnataka Mid Day Meal Wor

    కర్ణాటకలో పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు భోజనం!

  • Ex-MLA

    Ex-MLA: విమానంలో ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కర్ణాటక మాజీ ఎమ్మెల్యే!

Latest News

  • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd