Aadhaar Update: ఆధార్ అప్డేట్ త్రీ నెలల పాటు ఉచితం తెలుసా!
పదేళ్లు దాటితే ఆధార్ అప్ డేట్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం రూ.25 ఫీజుగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వసూలు చేస్తోంది.
- Author : Maheswara Rao Nadella
Date : 16-03-2023 - 11:20 IST
Published By : Hashtagu Telugu Desk
పదేళ్లు దాటితే ఆధార్ అప్ డేట్ (Aadhaar Update) చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం రూ.25 ఫీజుగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వసూలు చేస్తోంది. తాజాగా ఆధార్ అప్ డేట్ (Aadhaar Update) చేసుకునే వారికి యూఐడీఏఐ కొంత వెసులుబాటు కల్పించింది. ఆధార్ అప్ డేషన్ కోసం ఎలాంటి ఫీజూ వసూలు చేయొద్దని నిర్ణయించింది. అయితే, ఈ అవకాశం 3 నెలల వరకు మాత్రమే..
యూఐడీఏఐ అధికారుల ప్రకారం.. మార్చి 15 నుంచి జూన్ 14 వరకు ఆధార్ అప్డేట్ ఉచితంగా చేసుకోవచ్చు. అవసరమైన గుర్తింపు పత్రాలతో ఆధార్ పోర్టల్ ద్వారా ఈ అప్ డేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. ఉచిత సేవలు ‘మై ఆధార్ పోర్టల్’ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే, పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఇతర సేవలకు చార్జీలు చెల్లించాల్సిందే!
ఉచిత సదుపాయం కేవలం ఆధార్ అప్ డేషన్ కు మాత్రమేనని అధికారులు వివరించారు. ఈ నిర్ణయంతో లక్షలాది ప్రజలు లబ్ది పొందుతారని పేర్కొన్నారు. ఉచిత అప్ డేషన్ గడువు ముగిశాక రూ.50 చెల్లించి ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆధార్ కార్డును ప్రతీ పదేళ్లకు ఒకసారి అప్ డేట్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
Also Read: Software Updates: మొబైల్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?