Software Updates: మొబైల్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
మనం తరచూ వాడే ఫోన్లలో ఛార్జింగ్ ఉందా? డేటా సరిపోతుందా? అని చెక్ చేసుకుంటారే తప్ప, ఎప్పటికప్పుడు వచ్చే కొత్త సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని మాత్రం
- By Maheswara Rao Nadella Published Date - 06:00 PM, Wed - 15 March 23

మనం తరచూ వాడే ఫోన్లలో ఛార్జింగ్ ఉందా? డేటా సరిపోతుందా? అని చెక్ చేసుకుంటారే తప్ప.. ఎప్పటికప్పుడు వచ్చే కొత్త సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ (Software Update) చేయాలని మాత్రం చాలామంది అనుకోరు. ఒకవేళ ‘అప్‌డేట్ యువర్ డివైజ్’ అని వచ్చినా.. ‘తర్వాత చూసుకుందాంలే’ అని పక్కన పెట్టేస్తుంటారు. మరికొందరైతే ‘ఇప్పుడు అప్‌డేట్ చేస్తే డేటా అంతా తినేస్తుంది. పడుకొనే ముందు మిగిలిపోయిన డేటాతో అప్‌డేట్ చేద్దాంలే’ అనుకునే వారే మనలో ఎక్కువ. అయినా అప్‌డేట్ చేయనంత మాత్రాన నష్టం ఏముంది అనుకుంటున్నారా..? మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి
కొత్త ఫీచర్లు కోల్పోతాం: రోజులు మారుతున్నల్సిందే..! కొద్దీ సాంకేతికతలో మార్పులు సహజం. అలాగే మన మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటాయి. అలాగే పాత వాటిలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసి మెరుగులు దిద్దుతుంటాయి. ఇందులో కొన్ని సెక్యూరిటీకి సంబంధించినవీ ఉంటాయి. ఈ కొత్త ఫీచర్లు అందుకోవాలీ అంటే మనకొచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను (Software Updates) ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
ఫోన్ వేగం తగ్గొచ్చు: చాలా వరకు ఫోన్ తయారీ కంపెనీలు తరచూ సాప్ట్‌వేర్ అప్‌డేట్లను ఇస్తుంటాయి. ఇవి మొబైల్ పనితీరు మొరుగవ్వటానికి, ఫోన్ ఎక్కువ కాలం పనిచేయటానికి ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు మన ఫోన్ వేగం తగ్గడం గమనిస్తూ ఉంటాం. సాప్ట్‌వేర్ అప్‌డేట్ వచ్చినప్పుడు అప్‌డేట్ చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది.
బ్యాటరీ లైఫ్ మెరుగు: మొబైల్ కంపెనీలు విడుదల చేసే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌లో (Software Updates) కెమెరా పనితీరును మరింత మెరుగుపరచటంతో పాటు బ్యాటరీ లైఫ్‌నూ పెంచే అప్‌డేట్స్ ఉంటాయి. బ్యాటరీపై ఒత్తిడిని తగ్గించేందుకు మొబైల్ కంపెనీలు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఇస్తుంటాయి. ఒకవేళ అప్‌డేట్ చేసుకోకపోతే బ్యాటరీ పనితీరుపై ప్రభావం పడి దాని జీవితకాలం తగ్గుతుంది.
సైబర్ దాడుల నుంచి రక్షణ: సెక్యూరిటీ అప్‌డేట్ అనేది మన ఫోన్‌పై జరిగే హానికరమైన దాడుల నుంచి రక్షణ కల్పించడానికి సాయపడుతుంది. మన ఫోన్లలో ఉండే బగ్స్ కారణంగా ఒక్కోసారి సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్‌గా లేకపోతే సైబర్ నేరగాళ్లు మాల్‌వేర్‌ను మన ఫోన్‌లో జొప్పించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇస్తుంటాయి. దీనివల్ల ఇంటర్‌ఫేస్‌లో మార్పులు ఉండవు. కాబట్టి పదే పదే అప్‌డేట్‌లు వస్తున్నాయి కదా అని విసుక్కోకుండా అప్‌డేట్ చేసుకోవడం మంచిది.
Also Read: Smart Cities: ఏప్రిల్ నాటికి దేశంలో మరో 22 స్మార్ట్ సిటీలు రెడీ

Related News

WhatsApp: వాట్సాప్ డెస్క్ టాప్ లో సరికొత్త ఫీచర్స్.. అవేంటో తెలిస్తే వావ్ అనాల్సిందే!
ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది