Anant Ambani-Radhika: అనంత్ అంబానీ -రాధిక లవ్ స్టోరీ.. ఆసక్తికర విషయాలు తెలుసా
- By Balu J Published Date - 10:27 AM, Sat - 2 March 24
Anant Ambani-Radhika: అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వీరేన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్ పెళ్ళి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వీరి మ్యారేజ్ గురించే చర్చ జరుగుతుంది. ఇక అసలు అనంత్, రాధిక లవ్ జర్నీ గురించి తెలుసుకుందాం.అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ చిన్నప్పట్నుంచి మంచి ఫ్రెండ్స్. వీరిద్దరికి చిన్ననాటి నుంచి పరిచయం. ఇక ఆరేళ్లుగా ఇద్దరు కలిసి ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలానే వీరిద్దరు రెగ్యులర్‌గా పార్టీస్, ఇతర ప్రదేశాల్లో కనిపిస్తుండడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లుగా వార్తలొచ్చాయి కొన్నేళ్ళుగా రాధిక మర్చంట్, అంబానీ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి అటెండ్ అయ్యారు.
ముఖ్యంగా 2018లో ఇషా అంబానీ మ్యారేజికి కూడా హాజరయ్యారు. 2019లో ఆకాష్ అంబానీ మ్యారేజ్‌కి కూడా అటెండ్ అయ్యారు. భారత నాట్య కళాకారులకి అరంగేట్రం చాలా ముఖ్యమైనది. రాధిక మర్చంట్ భారత నాట్య నర్తకి. కాబట్టి, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ 2022లో కాబోయే కోడలు రాధిక అరంగేట్రాన్ని ఘనంగా నిర్వహించింది.పంజాబీ మ్యారేజెస్లో ఈ ఈవెంట్ చాలా ముఖ్యమైంది. వివాహానికి ముందు చేస్తారు. ఊరిలో పూల మొక్కలు నాటే కార్యక్రమం లాంటిదే.
ఆనంద్ అంబానీ, రాధిక మర్చంట్ ఇద్దరు కూడా గొప్ప పారిశ్రామికవేత్తల వారసులు. అనంత్ అంబానీ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు. అదే విధంగా, రాధిక మర్చంట్ ఎన్ కోర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అయిన విరెన్ మర్చంట్ కూతురు.ఆనంద్, రాధిక ఎంగేజ్మెంట్ గత ఏడాది జరిగింది. ఇందులో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ పాల్గొన్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జులైలో పెళ్ళి చేసుకోబోతున్నారు. కాగా ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేస్తున్నారు.
Related News
Mukesh Ambani Tears : కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ అంబానీ.. కొడుకు అనంత్ స్పీచ్ విని ఎమోషనల్
Mukesh Ambani Tears : ఎమోషన్.. ఎవ్వరికైనా ఒక్కటే. డబ్బులేని పేదవాడికైనా.. డబ్బులున్న ముకేశ్ అంబానీకైనా అది ఒక్కటే.