Also Read :Megha : మేఘా, స్కైరూట్, యూనీలీవర్.. తెలంగాణలో చేపట్టబోయే ప్రాజెక్టులు ఇవీ
నాడు కళకళ.. నేడు వెలవెల
అత్తారీ రైల్వే స్టేషనులో రైలు ఎక్కడం సంగతి అలా ఉంచండి. మీరు ఆ రైల్వే స్టేషనులోకి ప్రవేశించే క్రమంలోనే చాలా తనిఖీలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మన దేశ బార్డర్‌లో ఉండటంతో ఆ రైల్వే స్టేషనులో భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ప్రతీ ప్రయాణికుడిని, అతడి లగేజీలను ముమ్మరంగా తనిఖీ చేస్తుంటారు. పాకిస్తాన్ వీసా చూపిస్తేనే ఆ రైల్వే స్టేషనులోకి భద్రతా సిబ్బంది పంపిస్తారు. వీసా లేకుండా ఆ రైల్వే స్టేషనులో ఎవరైనా కనిపిస్తే అరెస్టు చేసి దర్యాప్తు చేస్తారు. అక్కడికి ఎందుకు వచ్చారు ? కారణం ఏమిటి ? ఏం చేయాలని వచ్చారు ? అనే ప్రశ్నలు అడుగుతారు. చట్టపరమైన కేసులను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. పాకిస్తానీ వీసా లేకుండా ఆ స్టేషనుకు వెళితే జైలుశిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే అత్తారీ రైల్వే స్టేషను భారత్-పాక్ మధ్య భూమార్గంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్‌గా పనిచేస్తుంటుంది. అత్తారీ రైల్వే స్టేషను నుంచే పాకిస్తాన్‌కు సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు నడిచేది. అయితే 2019లో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఈ రైలు సర్వీసును ఆపేశారు. ప్రస్తుతం ఈ స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది.