Tamil Nadu : తమిళనాడులో దారుణం.. మహిళా న్యాయవాదిపై దాడి
మహిళా న్యాయవాదిపై పట్టపగలు దుండగులు దాడికి తెగబడ్డారు. ఆమెపై దాడి చేయడంతో ముఖం, చేతులు తీవ్ర రక్తస్రావం
- By Prasad Published Date - 06:56 AM, Mon - 19 September 22

మహిళా న్యాయవాదిపై పట్టపగలు దుండగులు దాడికి తెగబడ్డారు. ఆమెపై దాడి చేయడంతో ముఖం, చేతులు తీవ్ర రక్తస్రావం అయింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు జమీలా బాను కుమరన్ సలైలోని మహిళా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నారు. తన పరిశోధన కోసం మునుపటి కేసులకు సంబంధించి నోట్ తీసుకోవడానికి ఆమె తన కుమార్తెతో పాటు న్యాయవాది కార్యాలయాన్ని సందర్శించింది. ఆ సమయంలో అకస్మాత్తుగా కార్యాలయంలోకి చొరబడిన ఓ వ్యక్తి జమీలా బానుపై కొడవలితో దాడి చేశాడు. ఆమె కుమార్తె ఆమెను రక్షించడానికి ప్రయత్నించగా, ఆమె కూడా గాయపడింది. జమీలా కేకలు విన్న జనం సాయం చేసేందుకు రంగంలోకి దిగారు. అయితే దుండగుడు ఆయుధాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. జమీలా కేకలు విని ప్రజలు సహాయం చేసేందుకు రావడంతో దుండగుడు ఆయుధాన్ని వదిలి పారిపోయాడు. జమీలా తలకు, చేతులకు గాయాలయ్యాయి. తదుపరి చికిత్స నిమిత్తం ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.