Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!
Stampede : మృతుల కుటుంబాలపై తనకున్న ఆవేదనను స్టాలిన్ బహిరంగంగా వ్యక్తం చేశారు. “ఇంతటి విషాదాన్ని చూసిన తర్వాత వారిని ఓదార్చడానికి నా దగ్గర మాటలే లేవు” అని ఆయన అన్నారు
- By Sudheer Published Date - 09:30 AM, Sun - 28 September 25

తమిళనాడులోని కరూర్లో TVK చీఫ్ విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట (Stampede ) దుర్ఘటనలో 39 మంది మృతిచెందిన నేపథ్యంలో రాష్ట్రం అంతా విషాదంలో మునిగిపోయింది. ఇంత పెద్దఎత్తున ప్రాణనష్టం జరగడం రాష్ట్ర ప్రజలను కలచివేసింది. ఈ నేపథ్యంలో మీడియా సీఎం స్టాలిన్(CM Stalin)ను విజయ్ అరెస్టుపై ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ విచారణ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Friday: ప్రతి శుక్రవారం ఇలా చేస్తే చాలు.. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!
సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. “బయట జరుగుతున్న ఊహాగానాలకు నేను సమాధానం చెప్పలేను. కమిషన్ రిపోర్ట్ వచ్చాక తగిన నిర్ణయం తీసుకుంటాం” అని పేర్కొన్నారు. ఘటనపై రాజకీయ వ్యాఖ్యలు చేయనని, బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తామని తెలిపారు. సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని ఆయన వివరించారు.
మృతుల కుటుంబాలపై తనకున్న ఆవేదనను స్టాలిన్ బహిరంగంగా వ్యక్తం చేశారు. “ఇంతటి విషాదాన్ని చూసిన తర్వాత వారిని ఓదార్చడానికి నా దగ్గర మాటలే లేవు” అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయి సహాయం అందించేందుకు కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఇకపై ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.