Friday: ప్రతి శుక్రవారం ఇలా చేస్తే చాలు.. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!
Friday: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే అమ్మవారు ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని పండితులు చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..
- By Anshu Published Date - 06:30 AM, Sun - 28 September 25

Friday: హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో లక్ష్మీదేవి కూడా ఒకరు. అమ్మవారి అనుగ్రహం కలిగితే చాలు అని ఎన్నెన్నో పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అలాగే దానధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే శుక్రవారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట. అయితే అందుకోసం ఏం చేయాలో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
లక్ష్మీదేవికి శుక్రవారం కి ముడిపడి ఉంటుంది. కాగా లక్ష్మీదేవి ఎనిమిది రూపాయలలో ధనలక్ష్మి అవతారం కూడా ఒకటి. ధనలక్ష్మి అనుగ్రహం ఉంటే ఎల్లప్పుడూ సంపద శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం. కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ని పూజించడం వల్ల మీ ఇంట్లో, మీ జీవితంలో సానుకూల, సంతోషకరమైన వాతావరణం నెలకుంటుందట. 21 శుక్రవారాలు ఉపవాసం ఉండటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. అయితే 21 శుక్రవారాలు ఉపవాసం ఉండటం సాధ్యం కాకపోతే కొన్ని పనులు చేసినా కూడా లక్ష్మీ కటాక్షం లభిస్తుందట. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. తామర గింజలతో తయారు చేసిన దండ లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట.
అంతేకాకుండా ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే అవి తీరతాయని, డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయని చెబుతున్నారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్రంలోనే పుట్టింది అని కూడా నమ్ముతారు. కాబట్టి శుక్రవారం రోజున మీరు ఈ గవ్వలు, ఆల్ చిప్పలను లక్ష్మీదేవికి సమర్పించాలట. ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి వీటిని సమర్పించడం వల్ల ఆమె అనుగ్రహం లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతున్నారు.
అదేవిధంగా శుక్రవారం రోజు మీ ఇంట్లోనే పూజ గదిలో శంఖం ని ఉంచడం వల్ల డబ్బు కొరత తీరుతుందట. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. మీ ఇంట్లో వేణువు వెదురును పెట్టుకుని శుక్రవారం రోజు పూజించడం వల్ల అది పేదరికంని తొలగించి సంపదను పెంచుతుందని చెబుతున్నారు. హిందూ మతంలో ప్రతిరోజూ ఆవులకు ఆహారం తినిపించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి శుక్రవారం రోజు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ సంపద మరింత పెరిగేలా చేస్తుందట. అలాగే ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకున్నా కూడా చాలా మంచి జరుగుతుందట. వేరొకరి ఇంటి నుంచి దొంగతనం తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే మరింత ఎక్కువ మంచి జరుగుతుందని చెబుతున్నారు.