HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Virat Kohli In All Likelihood To Be Rested For Sa T20 Home Series

Virat Kohli : విరాట్ కు విశ్రాంతి.. దక్షిణాఫ్రికా తో టీ20 సిరీస్ కు డౌటే?

ఫామ్ లో లేక బాధపడుతున్న విరాట్ కోహ్లీకి కొంత విరామం ఇవ్వాలని భారత జట్టు ఎంపిక కమిటీ సభ్యులు భావిస్తున్నారు.

  • By Hashtag U Published Date - 12:48 PM, Thu - 12 May 22
  • daily-hunt
Virat
Virat

ఫామ్ లో లేక బాధపడుతున్న విరాట్ కోహ్లీకి కొంత విరామం ఇవ్వాలని భారత జట్టు ఎంపిక కమిటీ సభ్యులు భావిస్తున్నారు. జూన్ 9 నుంచి 19 వరకు స్వదేశంలో దక్షిణాఫ్రికా తో జరిగే టీ20 టోర్నీకి విరాట్ ను జట్టులోకి తీసుకోవద్దని యోచిస్తున్నారు. దీనిపై ఛేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ సభ్యులు త్వరలోనే కోహ్లితో కీలక భేటీ జరుపనున్నారు. ఆ తర్వాత సెలెక్షన్ కమిటీ సభ్యులు.. టీమిండియా సారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లతో కూడా చర్చించనున్నారు.  ఆ తర్వాతే కోహ్లికి విశ్రాంతి విషయంలో ఓ స్పష్టత రానుంది. విరామం అనంతరం ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు కోహ్లి రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తాడని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఐపీఎల్ ముగిసేనాటికి.. దక్షిణాఫ్రికా తో టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశముంది.

ఐపీఎల్‌ లో పేలవంగా కోహ్లీ..

ఐపీఎల్-15లో విరాట్ కోహ్లీ 12 మ్యాచులు ఆడి 19.64 సగటుతో 216 పరుగులే చేశాడు. ఈ సీజన్ లో మూడు గోల్డెన్ డకౌట్లు అయ్యాడు. ఈనేపథ్యంలో  మాజీ కోచ్‌ రవిశాస్త్రి,మైఖేల్ వాన్ తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా కోహ్లీ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలల పాటు అతడికి విశ్రాంతి ఇవ్వాలని సూచనలు చేశారు. ఆ సూచనలను కోహ్లి ఎలా తీసుకున్నాడో గానీ.. సెలెక్టర్లు మాత్రం  వారి సలహాలను  తూచా తప్పకుండా పాటించబోతున్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయమై భారత జట్టు ఎంపిక  కమిటీకి చెందిన ఓ సభ్యుడు మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఒక దశ ప్రతి ఆటగాడి కెరీర్ లోనూ ఉంటుంది. కోహ్లి ప్రస్తుతం అదే దశలో ఉన్నాడు. అయితే త్వరలోనే అతడు దీనిని అధిగమిస్తాడనే నమ్మకం మాకుంది. కానీ సెలెక్టర్లుగా మా దృష్టి జట్టు మీద ఉంటుంది. మా మొదటి ప్రాధాన్యం కూడా అదే. దక్షిణాఫ్రికా తో సిరీస్ కు ముందు కోహ్లితో మాట్లాడతాం. ఒకవేళ అతడేమైనా విశ్రాంతి కావాలనుకుంటున్నాడా..? లేక పోరాడతాడా..? అనేది అడిగి తెలుసుకుంటాం…’ అని తెలిపారు.

ఐపీఎల్ లో కోహ్లీ స్కోర్ కార్డు..

ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ లలో వరుసగా 41 నాటౌట్, 12, 5, 48, 1, 12, 0, 0, 9, 58, 30, 0 (మొత్తం 216) స్కోర్లు కోహ్లీ చేశాడు. అయితే ఐపీఎల్ ప్రదర్శన అనేది జాతీయ జట్టుకు అన్నిసార్లు కొలమానం కానప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో కూడా కోహ్లి గొప్పగా రాణించింది లేదు. అతడు  సెంచరీ చేయక  100 (మూడు ఫార్మాట్లలో) ఇన్నింగ్స్ లు దాటాయి.

దక్షిణాఫ్రికా తో భారత్ టీ20 సిరీస్ షెడ్యూల్..

జూన్‌ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఢిల్లీ, కటక్‌, విశాఖపట్నం, రాజ్‌కోట్‌, బెంగళూరు వేదికల్లో జరుగనుంది. అనంతరం జూన్‌, జూలైలో టీమ్‌ ఇండియా యూకే కు వెళ్తుంది. అక్కడ మొదట ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడుతుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఒక టెస్టుతో పాటు టీ20, వన్డే సిరీస్‌ ఆడనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • home series
  • India vs south africa
  • team india
  • virat kohli
  • virat to be dropped

Related News

ODI Cricketers

ODI Cricketers: టీమిండియా టాప్‌-5 వ‌న్డే ఆట‌గాళ్లు వీరే!

టీమిండియాకు వారి సహకారం అసాధారణమైనదిగా ఉంది. ఇందులో రెండు ప్రపంచ కప్ కెప్టెన్లు కూడా ఉన్నారు. వీరు ప్రపంచ కప్‌ను కూడా గెలిచారు. రోహిత్ శర్మ మినహా ఈ జాబితాలోని వారందరూ ప్రపంచ కప్ విజేతలే.

  • Virat Kohli

    Virat Kohli in Sydney: ఏడో మ్యాచ్‌లో రికార్డు సవాల్.. కోహ్లీకి కఠిన పరీక్ష!

  • Virat Kohli

    Virat Kohli: ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ ప‌ట్టు త‌గ్గిపోయిందా? గ‌ణాంకాలు ఇవే!

  • Virat Kohli

    Virat Kohli: సిడ్నీ వన్డే తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటారా?

  • AUS Beat IND

    AUS Beat IND: అడిలైడ్‌ వన్డేలో భారత్ ఘోర ఓట‌మి.. సిరీస్ ఆసీస్ కైవ‌సం!

Latest News

  • Iphone : 2026లో యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్..!

  • viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు

  • Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!

  • Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

  • AP Rains: ఏపీకి తుపాను ముప్పు.. ఈ జిల్లాల ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ హెచ్చ‌రిక‌!

Trending News

    • Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్‌కుమార్.!

    • Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!

    • ఈ 6 రాశుల వారికి అప్పులిస్తే జాగ్రత్త..! తిరిగి డబ్బులు రావడం కష్టమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు

    • Five Habits: మీలో కూడా ఈ ఐదు అలవాట్లు ఉన్నాయోమో చెక్ చేసుకోండి!

    • Credit Card: క్రెడిట్ కార్డు భద్రత: 6 ముఖ్యమైన రహస్యాలు మీ కార్డును రక్షించుకోండి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd