Karnataka : వచ్చే ఏడాది ఫిబ్రవరికి ప్రారంభంకానున్న విజయపుర విమానాశ్రయం
కర్ణాటకలో విజయపుర విమానాశ్రయం పనులపై మంత్రి ఎం.బి. పాటిల్ సమీక్ష నిర్వహించారు. విజయపుర విమానాశ్రయానికి
- Author : Prasad
Date : 22-09-2023 - 12:20 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటకలో విజయపుర విమానాశ్రయం పనులపై మంత్రి ఎం.బి. పాటిల్ సమీక్ష నిర్వహించారు. విజయపుర విమానాశ్రయానికి సంబంధించిన అన్ని సివిల్ పనులను ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సహా అన్ని సంబంధిత అధికారుల నుండి అనుమతులు పొందిన తర్వాత ఫిబ్రవరి 2024 నాటికి విమానాశ్రయం ప్రారంభించేదుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం మొదటి రోజు నుండి విమాన సేవలు ప్రయాణికులకు అందించాలని తెలిపాఉ.ఈ విషయంలో విమానయాన సంస్థలతో చర్చలు జరపాలని అధికారులను ఆయన కోరారు. ప్రారంభ దశలో ప్రతిపాదనలో రాత్రిపూట ల్యాండింగ్ సౌకర్యం లేదఉ.. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నైట్ ల్యాండింగ్‌ను సులభతరం చేయడానికి నిబంధనలను రూపొందించింది.
విమానాశ్రయాన్ని జాతీయ రహదారికి అనుసంధానించడానికి 7.25 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి కూడా నిర్మాణం జరుగుతోంది.ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని ఆధికారులను అదేశించారు. మొత్తం 727 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విమానాశ్రయ ప్రాజెక్టుకు రూ.347.92 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ ప్రాజెక్టుకు రూ.303.70 కోట్లు రిలీజ్ చేశారు. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ మరియు టెర్మినల్ మేనేజర్‌ల నియామకాలతో పాటు సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బందిని త్వరగా నియమించాల్సిన అవసరాన్ని ఎంబి పాటిల్ తెలిపారు. మరో రెండు నెలల్లో వాహనాల కొనుగోళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.