TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం
TVK Vijay Rally in Stampede : తమిళనాడులోని కరూర్లో జరిగిన భారీ తొక్కిసలాట(Stampede ) ఘటన మరింత విషాదకరంగా మారింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి (39 dies)చేరిందని అధికారిక సమాచారం చెబుతోంది
- By Sudheer Published Date - 08:13 AM, Sun - 28 September 25

తమిళనాడులోని కరూర్లో జరిగిన భారీ తొక్కిసలాట(Stampede ) ఘటన మరింత విషాదకరంగా మారింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి (39 dies)చేరిందని అధికారిక సమాచారం చెబుతోంది. అరగంట వ్యవధిలోనే ఈ పెద్ద దుర్ఘటన చోటుచేసుకోవడం రాష్ట్రాన్ని, దేశాన్ని కలచివేసింది. పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి తరలివచ్చి గుమిగూడటంతో క్రమశిక్షణ కోల్పోయి గందరగోళం ఏర్పడింది.
Tulasi Plant: తులసి మొక్క విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో!
సమాచారం ప్రకారం ఉదయం 11 గంటల నుంచే ప్రజలు వేడుక కోసం వేచి ఉండగా, విజయ్ సాయంత్రం 7 గంటలకు సభా స్థలానికి చేరుకున్నారు. ఆయన ప్రసంగం మొదలైన కాసేపటికే జనంలో తొక్కిసలాట మొదలైంది. 7.15PMకు అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకోగా, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. 7.25PMకి విజయ్ ప్రసంగం ముగించారు. ఈ ఘటనతో 8PM వరకు ఆ ప్రాంతం ఖాళీ అయిపోయింది.
ఘటన అనంతరం విజయ్(Vijay) 9.45PMకి ఎయిర్పోర్టుకు చేరుకొని, రాత్రి 11.55PMకి తన నివాసానికి చేరుకున్నారు. ఈ సంఘటన రాష్ట్రంలో రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పెద్ద ఎత్తున జరిగే సభల్లో సరైన భద్రతా చర్యలు, గుమిగూడే జనసమూహంపై నియంత్రణ అవసరాన్ని ఈ దుర్ఘటన మరోసారి రుజువు చేసింది. ఇకపై ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.