Tulasi Plant: తులసి మొక్క విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో!
Tulasi Plant: తులసి మొక్క విషయంలో పొరపాటున కొన్ని రకాల తప్పులు, ముఖ్యంగా వాస్తు విషయాలను పాటించాలని లేదంటే అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Sun - 28 September 25

Tulasi Plant: హిందువుల ఇండ్లలో దాదాపుగా ప్రతీ ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్క లేని ఇళ్ళు దాదాపుగా ఉండవు. తులసి దేవిని ఇంటి దగ్గర పెట్టుకొని పూజించడంతో పాటుగా అనేక పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. కాగా ఈ మొక్కను ఇంట్లో ఎల్లప్పుడూ ఉత్తరం, ఈశాన్య దిశల్లో పెంచడం మంచిది. ఈ దిశల్లో తులసి మొక్క ఉంచడం వల్ల ఇంటి మొత్తానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. ఇంటి బాల్కనీ లేదా కిటికీ దగ్గర తులసి మొక్క పెట్టాలనుకుంటే ఉత్తరం వైపు ఉంచడం మంచిదని చెబుతున్నారు.
దీని వల్ల మొక్కకు గాలి, వెలుతురు బాగా అందుతాయట. అలాగే ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా తులసి మొక్కను ఉంచితే దేవతల అనుగ్రహం కలుగుతుందని, ఇంట్లో శాంతి, ఆనందం రెండూ ఉంటాయని చెబుతున్నారు. అయితే తులసి మొక్క ఉన్న పరిసరాలన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలట. తులసి మొక్క పరిసరాలు శుభ్రంగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ తొలగుతుందని చెబుతున్నారు. అలాగే ఈ మొక్క ఎప్పుడు ఎండి పోకుండా చూసుకోవాలట. తులసి మొక్క ఎండిపోతే దురదృష్టం కలగుతుందని చెబుతున్నారు. కాబట్టి అలా కాకూడదు అంటే ఎప్పటికప్పుడు సంరక్షణ చర్యలు తీసుకోవాలట.
ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు సమర్పించాలట. తులసి మొక్కకు నీళ్లు పోయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. ప్రతి రోజు తులసి మొక్కని ఆరాధిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుందట. అలాగే ప్రతిరోజూ తులసి మొక్క ముందు కూర్చొని మంత్రాలను చదివి పారాయణం చేయడం వల్ల ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయట. తులసి మొక్కను అనవసరంగా ముట్టుకోవడం వంటివి చేయకూడదు. తులసి మొక్కను పవిత్రంగా, గౌరవంగా చూసుకుంటే మంచి ఫలితాలు వస్తాయట. ముఖ్యంగా స్త్రీలు నెలసరి సమయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. అలాగే బుధవారం ఆదివారం రోజుల్లో తెలిసి మొక్కకు నీరు సమర్పించకూడదు. అమావాస్య, ఏకాదశి రోజుల్లో కూడా తులసి మొక్కకు నీటిని సమర్పించకూడదని పండితులు చెబుతున్నారు. ఈ విషయాలను తప్పకుండా పాటించాలని అప్పుడే తులసి దేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు..