25 KG Gold Jewellery : గోల్డ్ షోరూమ్‌కు కన్నం.. 25 కిలోల బంగారు ఆభరణాలు దోపిడీ
25 KG Gold Jewellery : తమిళనాడు కోయంబత్తూరులో భారీ దోపిడీ జరిగింది.
- By Pasha Published Date - 04:08 PM, Tue - 28 November 23

25 KG Gold Jewellery : తమిళనాడు కోయంబత్తూరులో భారీ దోపిడీ జరిగింది. నగరంలోని గాంధీపురంలో ఉన్న జోస్ ఆలుక్కాస్ అండ్ సన్స్ నుంచి ముసుగు ధరించిన ఓ వ్యక్తి దాదాపు 25కిలోల బంగారు ఆభరణాలను దోపిడీ చేశాడు. ఆ దుండగుడు సోమవారం అర్ధరాత్రి తర్వాత 2.30 గంటల సమయంలో దుకాణంలోకి చొరబడి చోరీ చేశాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నిందితుడిని గాలించేందుకు ఐదు టీమ్‌లను ఏర్పాటు చేశామని కోయంబత్తూరు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. సోమవారం రాత్రి జోస్ ఆలుక్కాస్ అండ్ సన్స్ దుకాణం మూసేసిన ఉద్యోగులు.. ఉదయం మళ్లీ వచ్చి చూసేసరికి షాపులో చిందరవందరగా జువెల్లరీ పడి ఉంది. దుకాణం వెనుక గోడ పగులగొట్టి బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడని గుర్తించారు. దోపిడీ చేసిన బంగారు నగల విలువ రూ.కోట్లలో ఉంటుందని(25 KG Gold Jewellery) అంచనా వేస్తున్నారు.