Tamil Nadu CM : సీఎం స్టాలిన్ కు కరోనా!
తమిళనాడు ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది.
- By Balu J Published Date - 12:24 PM, Wed - 13 July 22
తమిళనాడు ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు జ్వరం ఉందని, ఆందోళన చెందవద్దని పార్టీ నేతలకు చెప్పారు. ఒకటి లేదా రెండు రోజుల్లో కోలుకుంటానని, తిరిగి విధుల్లోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తతం వైద్యుల సూచన మేరకు స్టాలిన్ హోం ఐసోలేషన్ కు పరిమితమయ్యారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, బౌతిక దూరం పాటించాలని ఈ సందర్బంగా స్టాలిన్ సూచించారు. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 2,448 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి, మొత్తం 35,03,977కి చేరుకుంది. గత 24 గంటల్లో 2,465 మంది రోగులు డిశ్చార్జ్ కాగా, 18,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసులలో చెన్నైలో 796 వరకు నమోదయ్యాయి.
Related News
Lok Sabha Elections: 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభం.. పలు సంస్థలకు సెలవులు
శుక్రవారం (ఏప్రిల్ 19, 2024) లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) మొదటి దశ 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ 102 సీట్లు 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి.