Sri Sri Ravishankar: ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ (Sri Sri Ravishankar)కు చెందిన హెలికాప్టర్ తమిళనాడులోని ఈరోడ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేశారు.
- Author : Gopichand
Date : 25-01-2023 - 2:01 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ (Sri Sri Ravishankar)కు చెందిన హెలికాప్టర్ తమిళనాడులోని ఈరోడ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేశారు. ఈ చాపర్‌లో శ్రీశ్రీ రవిశంకర్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు.
Also Read: Road Accident in America: అమెరికాలో యాక్సిడెంట్.. తెలుగు యువతి దుర్మరణం
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన హెలికాప్టర్‌ను ఉదయం 10.40 గంటలకు ఈరోడ్‌లోని సత్యమంగళంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో హెలికాప్టర్ మళ్లీ బయలుదేరింది. దాదాపు 50 నిమిషాల తర్వాత హెలికాప్టర్ బయలుదేరింది.