HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Siddaramaiah Creates Sensation By Saying That Dk Would Have Become Cm Then

DK vs Siddaramaiah : డీకే సీఎం అయ్యేది అప్పుడే..అంటూ సిద్దరామయ్య సంచలనం!

  • By Vamsi Chowdary Korata Published Date - 05:42 PM, Tue - 2 December 25
  • daily-hunt
Dk Vs Siddaramaiah
Dk Vs Siddaramaiah

కర్ణాటకలో సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర దించే ప్రయత్నాలు చేపట్టింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఇందులో భాగంగా ఇద్దరు నేతలను కలిసి మాట్లాడుకోవాలని బంతి వాళ్ల కోర్టులోకే నెట్టింది. దీంతో ఇరువురి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇద్దరూ కలిసి రెండోసారి అల్పాహారం చేశారు. డీకే ముఖ్యమంత్రి అయ్యేది హైకమాండ్ నిర్ణయంపైనే అని సిద్ధరామయ్య అన్నారు. 2028 ఎన్నికలపై దృష్టి సారించామని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని డీకే తెలిపారు.

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై వివాదం కొనసాగుతుండగా.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌లు రెండోసారి కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. మంగళవారం ఉదయం డీకే నివాసానికి సీఎం సిద్ధూ వెళ్లారు. అల్పాహార భేటీ అనంతరం బయటకొచ్చిన సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా డీకే శివకుమార్‌కు సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే.. అప్పుడే ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టిసారించిందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని డీకే-సిద్ధూ పేర్కొన్నారు.

శాసనసభ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రైతుల సమస్యలు సహా పలు ఇతర అంశాలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చర్చించినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. ఈ విషయాలపై చర్చించడానికి అధిష్ఠానం పిలిస్తే తాము ఇద్దరం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వంలోని నేతలంతా కలిసికట్టుగా ఉన్నామని.. రాష్ట్రాభివృద్ధికి కలిసి పని చేస్తున్నామని వివరించారు. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. అలాగే, ఈ నెల 8న కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయనున్నట్లు సిద్ధూ తెలిపారు.

ఈ భేటీలోనూ నాయకత్వ మార్పుపై స్పష్టత రానప్పటికీ పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమనే సంకేతాలు సిద్ధరామయ్య ఇచ్చారు. అధిష్ఠానం చెప్పినట్లయితే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ‘పార్టీ తీసుకునే నిర్ణయాన్ని ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే తీసుకునే నిర్ణయాన్ని ఇద్దరమూ అంగీకరిస్తాం’ అని ఆయన అన్నారు.

మరోవైపు, తమ ఇంటికి వచ్చిన సీఎం సిద్ధరామయ్య పట్ల డీకే కుటుంబం గౌరవం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన ఆయన తమ్ముడు డీకే సురేష్, సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి, గౌరవాన్ని చాటుకున్నారు. కాగా, డిసెంబరు 8న ఢిల్లీలో జరిగే ఎంపీల సమావేశానికి ఇద్దర్నీ పిలిచే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

సీఎంతో బ్రేక్‌ఫాస్ట్ భేటీ గురించి డీకే.. ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. ‘‘ఈ రోజు నా నివాసంలో ముఖ్యమంత్రికి అల్పాహర ఆతిథ్యం ఇచ్చాను.. ఈ సందర్భంగా కాంగ్రెస్ దార్శనికతలో సుపరిపాలన, మా రాష్ట్ర నిరంతర అభివృద్ధికి మా నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించాం.. కాంగ్రెస్‌లో మాది ఒకటే నినాదం.. పార్టీలో ఎటువంటి విబేధాలు లేవు.. అంతా మీడియా సృష్టే’’ అని పేర్కొన్నారు.

విశ్వసనీయ వర్గాల ప్రకారం.. తాను ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుని, 2028 ఎన్నికల్లో డీకేకు మద్దతు ఇస్తాననేది సిద్ధరామయ్య ప్రతిపాదన. రాజకీయంగా ప్రభావం ఉన్న అహింద్ సమాజంలో సిద్ధరామయ్యకు ఉన్న బలం ఈ ప్రతిపాదనను ఆకర్షణీయంగా మార్చవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీకే ఆ ప్రతిపాదనను అంగీకరిస్తే, రాష్ట్రంలోని రెండు ప్రధాన ఓటు బ్యాంకులైన వొక్కలిగ, అహింద్ వర్గాలను కాంగ్రెస్ ఏకతాటిపైకి తెచ్చే అవకాశముందని అంచనా.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress party
  • DK Shivakumar
  • DK vs Siddaramaiah
  • karnataka politics

Related News

Siddaramaiah Dk Shivakumar

Karnataka CM Post : హైకమాండ్ ఎప్పుడు చెపితే అప్పుడు డీకే సీఎం అవుతాడు – సిద్దరామయ్య

Karnataka CM Post : కర్ణాటక ముఖ్యమంత్రి (CM) సిద్దరామయ్య మరియు ఉపముఖ్యమంత్రి (Dy.CM) డీకే శివకుమార్ ఇవాళ మరోసారి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌ను నిర్వహించడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది

  • Grama Panchayat Elections C

    Grama Panchayat Elections : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

  • Siddaramaiah Dk Shivakumar

    DK vs Siddaramaiah : ఇద్దరం కలిసే ఉంటాం.. కలిసే పనిచేస్తాం – డీకే స్పష్టం

Latest News

  • Ekadashi Dates 2026 : 2026 లో ఏకాదశి వచ్చే తేదీలు ఇవే!

  • DK vs Siddaramaiah : డీకే సీఎం అయ్యేది అప్పుడే..అంటూ సిద్దరామయ్య సంచలనం!

  • Robin Smith: ఇంగ్లాండ్ క్రికెట్‌కు బ్యాడ్ న్యూస్‌.. మాజీ క్రికెట‌ర్ క‌న్నుమూత‌!

  • November Car Sales: న‌వంబ‌ర్ నెల‌లో ఇన్ని కార్ల‌ను కొనేశారా?

  • 8th Pay Commission: కేంద్రం నుండి ప్రభుత్వ ఉద్యోగులు ఏం కోరుతున్నారు?

Trending News

    • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

    • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

    • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd