Robo Police : ‘రెడ్ బటన్’ రోబో పోలీసులు వస్తున్నారహో !!
ఈ ఏడాది జూన్ నుంచి చెన్నై(Robo Police) మహా నగరం పరిధిలోని 4 పోలీస్ జోన్లలో ఎంపిక చేసిన ప్రదేశాలలో రెడ్ బటన్ రోబోటిక్ పోలీస్ యంత్రాలను మోహరించనున్నారు.
- Author : Pasha
Date : 29-04-2025 - 4:33 IST
Published By : Hashtagu Telugu Desk
Robo Police : పోలీసింగ్ విషయంలో తమిళనాడు రాష్ట్రం దూసుకుపోతోంది. కరోనా మహమ్మారి వ్యాపించిన టైంలో కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ అమలుకు తమిళనాడు పోలీసులు రోబోలను వాడారు. ఆయా రోబోలు రోడ్లపై, వీధుల్లో నడుస్తూ ప్రజలను అలర్ట్ చేశాయి. అందరినీ ఆకట్టుకున్నాయి. త్వరలోనే మరో తరహా రోబోలను తమిళనాడు పోలీసులు రంగంలోకి దింపబోతున్నారు. అవే.. ‘రెడ్ బటన్ రోబోటిక్ కాప్’ . ఇంతకీ ఏమిటివి ? ఎలా పనిచేస్తాయి ? తెలుసుకుందాం..
Also Read :Pegasus Spyware : ఇజ్రాయెలీ ‘పెగాసస్’ స్పైవేర్ కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అలర్ట్ మెసేజ్‌లు
‘రెడ్ బటన్ రోబోటిక్ కాప్’ అనే పేరులోనే విషయమంతా ఉంది. ఈ రోబోపై ఒక రెడ్ బటన్ ఉంటుంది. ఆపదలో ఉన్నవారు, పోలీసు సాయం అవసరమైన వారు రెడ్ బటన్‌ను నొక్కితే చాలు. వెంటనే సమీపంలోని పోలీసు పెట్రోలింగ్ వాహనాలకు, పోలీసు స్టేషన్లకు అలర్ట్ మెసేజ్‌లు వెళ్లిపోతాయి. ఈ మెసేజ్‌లలో లొకేషన్ వివరాలు కూడా ఉంటాయి. దీంతో పోలీసులు లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటారు. మహిళలు, యువతులు, బాలికలతో పాటు ఆపదలో ఉన్న వారికి అత్యవసర పోలీసు సాయం అందేలా చూడటానికే ఈ పోలీస్ రోబోలను చెన్నై మహానగరం పోలీసులు అందుబాటులోకి తెస్తున్నారు.
అత్యవసర కాల్ అలారం
‘రెడ్ బటన్ రోబోటిక్ కాప్’లోని రెడ్ బటన్‌ను నొక్కగానే అందులోని అత్యవసర కాల్ అలారం మోగుతుంది. ఇది చాలా దూరం వరకు వినిపిస్తుంది. తద్వారా సమీపంలోని పోలీసుల పెట్రోలింగ్ టీమ్‌లు అలర్ట్ అవుతాయి. చేరువలో ఉండే ప్రజలు కూడా అలారం సౌండ్‌తో అప్రమత్తమై ఆపదలో ఉన్న వారికి సాయం చేయడానికి ముందుకొస్తారు.
Also Read :KCR Vs BJP : కాంగ్రెస్ విలన్ ఐతే.. బీజేపీ ఫ్రెండా ? కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే!
‘రెడ్ బటన్ రోబోటిక్ కాప్’లోని ఫీచర్లు..
- ‘రెడ్ బటన్ రోబోటిక్ కాప్’లో మైక్రోఫోన్, జీపీఎస్, కెమెరా ఫీచర్లు ఉన్నాయి.
- ఇది నిత్యం ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉంటుంది.
- ఆపదలో ఉన్న వ్యక్తి ఈ రోబోలోని కెమెరాతో పోలీసు స్టేషనుకు నేరుగా వీడియో కాల్ చేయొచ్చు.
- దీని ద్వారా చేసే వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ రికార్డ్ అవుతాయి.
- రెడ్ బటన్ రోబోటిక్ కాప్‌లు 360 డిగ్రీల కోణంలో ఎటువైపైనా తిరగగలవు. వీటిలో ఉండే కెమెరాలు 24 గంటలూ పరిసర ప్రాంతాల్లోని పరిస్థితిని పర్యవేక్షిస్తాయి. వీడియో, ఆడియోలను రికార్డు చేస్తాయి.
200 ప్రదేశాలలో మోహరింపు
ఈ ఏడాది జూన్ నుంచి చెన్నై(Robo Police) మహా నగరం పరిధిలోని 4 పోలీస్ జోన్లలో ఎంపిక చేసిన ప్రదేశాలలో రెడ్ బటన్ రోబోటిక్ పోలీస్ యంత్రాలను మోహరించనున్నారు. తొలి విడతలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలు, కర్మాగారాలు, ఐటీ కంపెనీలు, పార్కులు, ఆస్పత్రులు వంటి చోట్ల వీటిని ఏర్పాటు చేస్తారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో సంచరించే 200 ప్రదేశాలలో ఈ రోబో పోలీసులను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.