OPS And EPS: మళ్లీ ఈపీఎస్ వర్సెస్ ఓపీఎస్
అన్నాడీఎంకేలో మళ్లీ చిచ్చు రాజుకుంది. ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికల్లో పోటీకి ఓపీఎస్ వర్గం సై అనడంతో .. రెండాకుల గుర్తు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా..? కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమగన్ ఈవేరా మృతితో ఖాళీ అయిన ఈరోడ్ తూర్పు నియోజకర్గానికి ఫిబ్రవరి 27న ఉప ఎన్నిక జరగనుంది.
- By Hashtag U Updated On - 11:57 AM, Sun - 22 January 23

అన్నాడీఎంకేలో మళ్లీ చిచ్చు రాజుకుంది. ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికల్లో పోటీకి ఓపీఎస్ వర్గం సై అనడంతో .. రెండాకుల గుర్తు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా..? కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమగన్ ఈవేరా మృతితో ఖాళీ అయిన ఈరోడ్ తూర్పు నియోజకర్గానికి ఫిబ్రవరి 27న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేయడంతో.. రాజకీయం వేడెక్కింది. అంతర్గత కుమ్ములాటలతో వర్గాలుగా చీలిపోయిన అన్నాడీఎంకేలో.. ఈ ఉపఎన్నిక మళ్లీ వివాదం రాజేసింది.ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గంలో పోటీకి సై అంటే సై అంటున్నాయి
పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలు. ఈపీఎస్ వర్గం అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధమవుతుండగా.. సంచలన ప్రకటన చేశారు ఓపీఎస్. ఈరోడ్ ఈస్ట్ నుంచి తాను బీఫామ్ ఇచ్చిన అభ్యర్థే పోటీచేస్తాడని స్పష్టంచేశారు. అన్నాడీఎంకే సమన్వయకర్త హోదాలో రెండాకుల గుర్తుపై తనకే హక్కు ఉందంటున్నారు పన్నీర్‌సెల్వం. ఒకవేళ రెండాకుల గుర్తును ఈసీ బ్లాక్ చేస్తే.. వేరే గుర్తుపైనైనా పోటీకి రెడీ అని తేల్చిచెప్పారు.
ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే పోటీ చేయడంలేదు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో.. సీటు ఆ పార్టీకే ఇచ్చేసింది. అభ్యర్థి ఖరారు కాకపోయినా.. మంత్రులు ప్రచారం మొదలెట్టేశారు. హస్తానికి ఓటేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తల పరిస్థితి మాత్రం గందరగోళంగా మారింది. ఎవరు పోటీచేస్తారు.. ఎవరికి మద్దతివ్వాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఓపీఎస్-ఈపీఎస్ వర్గపోరు నేపథ్యంలో మిత్రపక్షం PMK ఉపఎన్నికకు పూర్తిగా దూరం జరిగింది. దీంతో మధ్యవర్తిగా రంగంలోకి దిగింది బీజేపీ.
Also Read: CSR Analysis : ఓట్ల పోస్టుమార్టం , బహు పరాక్ , నిర్లక్ష్యం చేస్తే గల్లంతే!
ఇరువర్గాల సీనియర్లతో భేటీ అయ్యారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. సమన్వయం ముందుకెళ్లి.. ఈరోడ్ ఈస్ట్ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించాలని విజ్ఞప్తిచేశారు. ఈరోడ్ తూర్పు నియోజకవర్గం తందై పెరియార్, గణితమేథావి రామానుజం వంటి మేథావులు జన్మించిన స్థలం. 2008 ఎన్నికల ముందు వరకు ఉమ్మడి ఈరోడ్ అసెంబ్లీ స్థానంగా ఉండేది. 2008లో జరిగిన నియోజకకవర్గాల పునర్విభజనలో ఈరోడ్ వెస్ట్, ఈరోడ్ ఈస్ట్ గా విడిపోయింది. పునర్‌విభజన తర్వాత జరిగిన తొలి రెండు ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని దక్కించుకుంది.

Related News

Erode East Byelection: కాంగ్రెస్ అభ్యర్థి ఇళంగోవన్‌కు కమల్ హాసన్ మద్దతు
వచ్చే నెల 27న తమిళనాడులోని ఈరోడ్ తూర్పు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక( Erode East yelection)లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (ఎస్‌పీఏ) అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ బరిలోకి దిగారు. రోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి బేషరతుగా మద్దతు ఇవ్వాలని నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నిర్ణయించుకున్నారు.