Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ, తొక్కిసలాటలో ఒకరు మృతి
శబరిమల ఆలయంలో నిర్వహణ లోపంపై కేరళలో నిరసనలు చెలరేగాయి.
- By Balu J Published Date - 04:49 PM, Wed - 13 December 23

Sabarimala: శబరిమల ఆలయంలో నిర్వహణ లోపంపై కేరళలో నిరసనలు చెలరేగాయి. ఆందోళనలు, నిరసనలు కారణంగా 11 ఏళ్ల బాలిక మరణించింది. రద్దీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పదకొండేళ్ల బాలిక మృతి చెందింది. క్యూ లైన్‌లో నిల్చుని దర్శనం కోసం వేచి చూస్తున్న 11 ఏండ్ల బాలిక స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను పంపా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ బాలిక శనివారం మరణించింది. ఆ బాలిక తమిళనాడులోని సేలంకు చెందిన అమ్మాయిగా గుర్తించారు.
యాత్రికుల సంఖ్య పెరగడం వల్ల క్యూలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే భక్తుల రద్దీ పెరగడంతో అక్కడ అస్తవ్యస్తమైన దృశ్యాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ పరిస్థితిని పరిష్కరించడానికి రంగంలోకి దిగారు. దర్శన సమయాలను పొడిగించడం వంటి చర్యలు చేపట్టారు.
అయితే భారీ క్యూలు, కనీస సౌకర్యాల లేమిని పేర్కొంటూ బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలోపంతోందని ఆరోపించారు. ఇక యాత్రికులను ఆదుకోవాలని, క్యూ కాంప్లెక్స్‌లో పరిశుభ్రత పాటించాలని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.