Murugan Ashwin: తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన క్యాచ్.. డైవ్ చేసి మరీ పట్టాడు..!
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో 8వ మ్యాచ్ మధురై పాంథర్స్, దిండిగల్ డ్రాగన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో మురుగన్ అశ్విన్ (Murugan Ashwin) ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
- By Gopichand Published Date - 09:39 AM, Mon - 19 June 23

Murugan Ashwin: తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో 8వ మ్యాచ్ మధురై పాంథర్స్, దిండిగల్ డ్రాగన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో దిండిగల్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మధురై123 పరుగులు చేసింది. అనంతరం దిండిగల్ 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో మురుగన్ అశ్విన్ (Murugan Ashwin) ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అశ్విన్ గాలిలో దూకి కష్టమైన క్యాచ్ పట్టాడు. అతని క్యాచ్‌కి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయబడ్డాయి.
ఎస్. అరుణ్ దిండిగల్ తరఫున మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. 5 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. నాలుగో ఓవర్ నాలుగో బంతికి అరుణ్ షాట్ ఆడగా బంతి గాలిలోకి లేచింది. ఇది చూసిన మురుగన్ అశ్విన్ డైవ్ చేసి కష్టమైన క్యాచ్ పట్టాడు. సోషల్ మీడియాలో అశ్విన్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అశ్విన్ ఇంతకు ముందు కూడా చాలా గొప్ప క్యాచ్‌లు పట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 2.1 ఓవర్లు వేసిన అతను 11 పరుగులు ఇచ్చాడు. 16 బంతుల్లో 10 పరుగులు కూడా చేశాడు.
Also Read: Moeen Ali Fined: పుట్టినరోజు నాడే మొయిన్ అలీకి బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా..!
Let me know the better running back catch than this. Only Ashwin Anna can do it but this time it is Murugan Ashwin😅. #TNPL2023 pic.twitter.com/tUD31dvSDG
— Shashank Yadav (@shashankkyadav) June 18, 2023
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో లైకా కోవై కింగ్స్ విజయం సాధించింది. ఇక పాయింట్ల పట్టికలో దిండిగల్ అగ్రస్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించింది. చెపాక్ జట్టు కూడా 2 మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించింది. కానీ దిండిగల్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. అందుకే అగ్రస్థానంలో ఉంది. నెల్లీ రాయల్ కింగ్స్ 2 మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు కూడా విజయం సాధించింది.