HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Model Temple Of Srivari At Maha Kumbh Mela Br Naidu

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం: బీఆర్ నాయుడు

కుంభ మేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కౄతీ పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

  • Author : Gopichand Date : 04-01-2025 - 6:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maha Kumbh Mela
Maha Kumbh Mela

Maha Kumbh Mela: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జరుగనున్న మహా కుంభమేళాలో (Maha Kumbh Mela) సెక్టార్ 6లో వాసుకి ఆలయం ప్రక్కన శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు. జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు మహా కుంభమేళా జరుగనున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేసేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. రామచంద్ర పుష్కరిణి వద్ద మీడియాతో శనివారం ఛైర్మన్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రయాగ్ రాజ్‌లో ఉత్తరాధి భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. తిరుమల తరహాలో శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం, తదితర కైంకర్యాలు చేపడుతారని ఛైర్మన్ తెలిపారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్ప అలంకరణలు చేపట్టాలని సూచించామన్నారు. మహాకుంభ మేళాకు సంబంధించి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా కార్యాచరణ సిద్దం చేశారన్నారు. మహాకుంభ మేళాకు టీటీడీ అధికారులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఎస్వీబీసీ ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో ఎం. గౌతమి, సివీఎస్‌వీ శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ మౌర్య‌, టీటీడీ సీఈ సత్యనారాయణ, తదితర అధికారులు పాల్గొన్నారు.

Also Read: Refund Rules: విమాన ప్ర‌యాణీకుల‌కు అదిరిపోయే న్యూస్‌.. ఇలా జ‌రిగితే మీ ఖాతాకు డ‌బ్బు!

మహాకుంభ మేళ లో శ్రీవారి నమూనా ఆలయం :

భక్తులకు దర్శన ఏర్పాట్లు : టిటిడి చైర్మెన్ శ్రీ బీ.ఆర్.నాయుడు

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జరుగనున్న మహాకుంభ మేళలో సెక్టార్ 6 లో వాసుకి ఆలయం ప్రక్కన శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మెన్ శ్రీ…

— B R Naidu (@BollineniRNaidu) January 4, 2025

కుంభ మేళా అంటే ఏమిటి?

కుంభ మేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కౄతీ పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది. పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళా నిర్వహిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • br naidu
  • Maha Kumbh Mela
  • Mahakumbh 2025
  • TTD chairman
  • TTD Chairman BR Naidu
  • uttarpradesh

Related News

VVIP Break Darshan Tirumala Online Booking

టీటీడీ గుడ్ న్యూస్..శ్రీవారి ప్రోటోకాల్ దర్శనం..సేవలో తరించే ఛాన్స్, వెంటనే ఇలా చేయండి!

Tirumala Tirupati Devasthanams  టీటీడీ శ్రీవారి వైద్య సేవ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. శ్రీవారి వైద్యసేవలో భాగంగా చికిత్స, బోధన, పరిశోధన రంగాల్లో ఎక్స్‌పర్ట్ డాక్టర్లను టీటీడీ ఆహ్వానిస్తోంది. నెలలో సగటున వారం రోజులపాటు ఆసుపత్రుల్లో సేవలు అందించొచ్చు. వీరికి ప్రోటోకాల్ శ్రీవారి దర్శనం, వసతి, భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు టీటీడీ అధ

  • BR Naidu

    తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Latest News

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd