Rain Alert: ఏపీ,తమిళనాడుకు ఆరెంజ్ అలెర్ట్ …వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరప్రాంత జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఏపీలోని రెండు జిల్లాలు, తమిళనాడులోని 11 జిల్లాలకు ఈ అలర్ట్ ని ప్రకటించింది.
- Author : Hashtag U
Date : 28-11-2021 - 12:12 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరప్రాంత జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఏపీలోని రెండు జిల్లాలు, తమిళనాడులోని 11 జిల్లాలకు ఈ అలర్ట్ ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరుతో పాటు చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, పుదుచ్చేరి, కడలూరు, తంజావూరు, తిరువారూరు, నాగపట్నం, తమిళనాడులోని కారైకల్‌లలో ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు.
ఆరెంజ్ అలర్ట్ సాధారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాన్ని సూచిస్తుంది. కొమోరిన్ ప్రాంతంపై తుఫాను సర్క్యులేషన్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో ఈశాన్య దిశగా బలమైన గాలులు వీస్తాయని…తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మహే, లక్షద్వీప్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, యానంలో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆ తర్వాత వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమైన రెండు దక్షిణాది రాష్ట్రాలకు వర్షపాతం తగ్గుదల చాలా అవసరం. ఈ వారం ప్రారంభంలో ఏపీలో వరదల కారణంగా 44 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది కొట్టుకుపోయారు.
తమిళనాడులో గత 200 ఏళ్లలో చెన్నైలో ఒక్క నెలలో 1,000 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిశాయని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ముఖ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన… రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోమవారం నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్ కడప, అనంతపురం జిల్లాలతో పాటు తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం జిల్లాలు, కేరళలోని ఇడుక్కి జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.