HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Key Guidelines Issued For Jallikattu Competitions

Jallikattu 2025: జల్లికట్టు పోటీలకు కీలక మార్గదర్శకాలు జారీ..

తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు పోటీలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 25-12-2024 - 2:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jallikattu 2025
Jallikattu 2025

Jallikattu 2025: సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందెలు నిర్వహించడం అనేది ఒక సంప్రదాయం. అంతే కాకుండా, తమిళనాడులో కూడా ప్రజలు ప్రతి ఏడాది జల్లికట్టు పేరిట సంబరాలు జరుపుకుంటారు. ఈసారి, 2025 జల్లికట్టు పోటీలకు తమిళనాడు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

జల్లికట్టు పోటీలు ఈసారి ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను సంక్రాంతి అని పిలుస్తారు, ఇక తమిళనాడులో దీనికి పొంగల్ అని పేరు. అయినా, పండుగ ఒకటే. ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో జరగనున్న జల్లికట్టు పోటీల్లో అపశృతి నివారించడానికి ప్రభుత్వం కొన్ని కొత్త నియమాలను ప్రకటించింది.

తమిళనాడు రాష్ట్రంలోని అలంకనల్లూరు, పాలమేడు, అవనియాపురం, మదురై, పుదుకోట్టై, శివగంగై వంటి ప్రధాన ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యప్రద సాహు జల్లికట్టు నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు.

Jallikattu

Jallikattu

జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి:

జల్లికట్టు పోటీలు నిర్వహించాలనుకునే నిర్వాహకులు ముందుగా జిల్లా కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. కలెక్టర్ అనుమతి లేకుండా జల్లికట్టు పోటీలు నిర్వహించడాన్ని ప్రభుత్వం అనుమతించదు. అలాగే, పోటీల్లో పాల్గొనే ఎద్దులను వేధించకూడదని, ప్రతి పోటీని వీడియో ద్వారా రికార్డు చేయాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది.

బోర్డ్ నివేదిక తప్పనిసరి:

జల్లికట్టు పోటీ తేదీ కంటే ముందే అన్ని ఏర్పాట్లు చేయాలని, తమిళనాడు జంతు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ పోటీలకు ముందే కార్యక్రమాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించింది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు…

జల్లికట్టు ఈవెంట్స్‌ కోసం కొత్తగా డిజైన్ చేసిన వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ప్రాసెస్ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ www.jallikattu.tn.gov.in ను సందర్శించండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Stalin
  • jallikattu
  • Jallikattu 2025
  • Tamil Nadu CM Stalin
  • Tamilnadu Government

Related News

    Latest News

    • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

    • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

    • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

    • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

    • Ultratech : పారిశ్రామిక చరిత్రలో సరికొత్త రికార్డు సాధించిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd