Woman Dies After Eating Biryani: కేరళలో విషాదం.. బిర్యానీ తిని యువతి మృతి
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బిర్యానీ తిని ఓ మహిళ అస్వస్థతకు గురై మరణించిన (Woman Dies) ఘటన కేరళ (Kerala)లో చోటుచేసుకుంది. కాసరగోడ్‌కు చెందిన అంజుశ్రీ పార్వతి డిసెంబర్ 31న బిర్యానీ ఆర్డర్ చేసింది. అది తిన్న తర్వాత ఆమె అస్వస్థతకు గురైంది.
- By Gopichand Published Date - 03:59 PM, Sat - 7 January 23

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బిర్యానీ తిని ఓ మహిళ అస్వస్థతకు గురై మరణించిన (Woman Dies) ఘటన కేరళ (Kerala)లో చోటుచేసుకుంది. కాసరగోడ్‌కు చెందిన అంజుశ్రీ పార్వతి డిసెంబర్ 31న బిర్యానీ ఆర్డర్ చేసింది. అది తిన్న తర్వాత ఆమె అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది.
నివేదికల ప్రకారం.. యువతి స్థానిక హోటల్ నుండి ‘కుజిమంతి’ అనే వెరైటీ బిర్యానీని ఆర్డర్ చేసిందని, దానిని తిన్న తర్వాత ఆమె శనివారం మరణించింది. యువతిని పెరుంబాల నివాసి అంజు శ్రీపార్వతిగా గుర్తించారు. ఈ ఘటనపై కాసరగోడ్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోటల్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 31న కాసర్‌గోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కుజిమంతిని అంజు తిన్నట్లు పోలీసు అధికారి తెలిపారు. బిర్యానీ తిని అస్వస్థతకు గురైన ఆమె అప్పటి నుంచి చికిత్స పొందుతోంది. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read: Ayodhya Ram Temple: రామమందిరంపై ఉగ్రవాదుల కన్ను.. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చేస్తాం
అంజు శ్రీపార్వతి తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందింది. అక్కడి నుంచి కర్ణాటకలోని మంగళూరులోని మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిండి. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పథనంతిట్టలో విలేకరులకు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎ) కింద ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన హోటళ్ల లైసెన్స్‌ను రద్దు చేస్తామని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ వారం ప్రారంభంలో కొట్టాయం మెడికల్ కాలేజీలో ఒక నర్సు ఫుడ్ పాయిజనింగ్‌తో మరణించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కోజికోడ్‌లోని ఒక రెస్టారెంట్ నుండి నర్సు ఫుడ్ ఆర్డర్ చేసిందని, అది తిన్న తర్వాత ఆమె అనారోగ్యానికి గురై చనిపోయింది.