HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Kerala Man Files Complaint Over Noisy Rooster Crowing At 3 Am

Rooster Crow : కోడి కూతపై కంప్లయింట్.. అధికారుల సంచలన ఆదేశం

అనిల్ తన ఇంటి పైఅంతస్తులో కోడిని(Rooster Crow) ఉంచినట్టు గుర్తించారు.

  • Author : Pasha Date : 19-02-2025 - 7:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kerala Man Noisy Rooster Crow

Rooster Crow : విచిత్రమైన ఘటన అంటే ఇదే. పక్కింట్లో ఉన్న కోడి వల్ల తనకు మనశ్శాంతి లేకుండా పోయిందంటూ ఓ వ్యక్తి  అధికారులకు ఫిర్యాదు చేశాడు. కోడి ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకు కూస్తోందని, దానివల్ల తన నిద్ర చెడిపోతోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వివరాలివీ..

Also Read :Hyderabad Real Estate : హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డౌన్.. ‘రియల్‌’ సంక్షోభం

పక్కింట్లోనే ఉండే..

ఈ ఘటన వివరాలు తెలియాలంటే మనం కేరళలోని పతనంతిట్ట జిల్లా పల్లికల్ గ్రామానికి వెళ్లాలి. అక్కడ రాధాకృష్ణ కురుప్, అనిల్ కుమార్‌ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్న విషయానికే గొడవ జరిగింది. వీళ్లిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. అనిల్ కుమార్‌కు చెందిన కోడి ప్రతిరోజూ తెల్లవారుజామున మూడు గంటలకే కూస్తోంది. దీనివల్ల పక్కింట్లోనే ఉండే తన నిద్రకు భంగం కలుగుతోందంటూ రాధాకృష్ణ కురుప్ అనే వృద్ధుడు.. అడూర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసు (ఆర్‌డీఓ)లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా  అధికారులు విచారణ మొదలుపెట్టారు.

Also Read :India’s Smallest Passenger Train : కేవలం 9 కి.మీ నడిచే ట్రైన్ ఉందని మీకు తెలుసా..?

ఇంటి పైఅంతస్తులోని కోడిని..

ఈక్రమంలో రాధాకృష్ణ కురుప్, అనిల్ కుమార్‌‌లను  ఆర్‌డీఓ ఆఫీసుకు పిలిపించి మాట్లాడారు. అసలు సమస్యేంటో అడిగి తెలుసుకున్నారు. తదుపరిగా అధికారులు వెళ్లి ఇద్దరి ఇళ్లను పరిశీలించారు. అనిల్ తన ఇంటి పైఅంతస్తులో కోడిని(Rooster Crow) ఉంచినట్టు గుర్తించారు. ఒకటి, రెండు రోజుల పాటు తెల్లవారుజామునే రాధాకృష్ణ కురుప్, అనిల్ కుమార్‌‌ ఇళ్లకు అధికారులు వెళ్లారు. తెల్లవారుజామునే మూడు గంటలకు కోడి కూస్తున్నట్లు వారి పరిశీలనలో వెల్లడైంది. అనిల్ ఇంటి పైఅంతస్తులో ఉన్న  కోళ్ల షెడ్‌ను.. అతడి ఇంటి దక్షిణ భాగం వైపునకు మార్చాలని అధికారులు ఆదేశించారు.  ఈమేరకు మార్పులు చేసేందుకు అనిల్‌కు 14 రోజుల గడువు ఇచ్చారు. మొత్తం మీద ఈ కోడికూత వివాదం పల్లికల్ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.  దీనిపై కూడా ఈవిధంగా కంప్లయింట్లు ఇచ్చుకుంటారా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kerala
  • Kerala man
  • Noisy Rooster
  • Rooster
  • Rooster Crow

Related News

The Kerala Story 2

The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

Pinarayi Vijayan  ఫిబ్రవరి 27న విడుదల కానున్న ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా రూపొందించిన విద్వేషపూరిత ప్రచారమని ఆయన అభివర్ణించారు. శాంతియుతంగా ఉండే కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టులు, దర్

  • Kerala's Hi Lite Group Gift

    Luxury Cars : అబ్బ.. ఉద్యోగులకు లగ్జరీ కార్లు గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ! చాల గ్రేట్ కదా !!

Latest News

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd