Karnataka 2023: కన్నడ ఎన్నికల్లో అమూల్, ముస్లిం రిజర్వేషన్ల వేడి
ఎన్నికల్లో (Karnataka 2023) సున్నితమైన అంశాలు చాలా ప్రభావితం చూపుతాయని చరిత్ర చెబుతోంది. మతం, ప్రాంతం, కులం అత్యంత సున్నితమైనవి.
- Author : CS Rao
Date : 27-04-2023 - 4:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికల్లో (Karnataka 2023) సున్నితమైన అంశాలు చాలా ప్రభావితం చూపుతాయని చరిత్ర చెబుతోంది. మతం, ప్రాంతం, కులం ఎన్నికల్లో అత్యంత సున్నితమైనవి. వాటికి సంబంధించిన అంశాలు ఒక్కోసారి కలిసి రావచ్చు లేదా పూర్తిగా నష్టపరచొచ్చు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో సున్నితమైన `అమూల్` (Amul)అంశం తెర మీదకు వచ్చింది. గుజరాత్ కు సంబంధించిన అమూల్ సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నంది)ను విలీనం చేసుకుంటుందన్న దుమారం రేగింది. అంతేకాదు, అమూలు పెరుగు ప్యాకెట్ల మీద కర్డ్ అనే పదాన్ని దహీగా మార్చడం కూడా రాజకీయ అంశంగా మారింది. దీన్నో ప్రాంతీయ మనోభావాల అంశంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లింది.
ఎన్నికల్లో సున్నితమైన అంశాలు ప్రభావితం(Karnataka 2023)
దేశంలోనే అత్యంత పెద్ద పాల ఉత్పత్తిదారుగా గుజరాత్ కు చెందిన అమూల్(amul) కు పేరుంది. దాని కిందకు మిగిలిన పాల ఉత్పత్తి సంస్థలను తీసుకెళుతున్నారని మోడీ, అమిత్ షా మీద కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దానికి ఉదాహరణగా బ్యాంకుల విలీనం అంశాన్ని చెబుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఆంధ్ర, విజయా బ్యాంకులను విలీనం చేసిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. అదే మాదిరిగా అమూల్(Amul) లో నందిని కలిపేసుకుంటారని ప్రజల మధ్యకు బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళుతోంది. దేశంలోని పాల ఉత్పత్తి చేసే ఫెడరేషన్లలో రెండో స్థానంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉంది. దాన్ని విలీనం చేసుకోవడానికి బీజేపీ సిద్ధమయిందని (Karnataka 2023)కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
అమూల్లో నందిని
వాస్తవంగా అమూల్(Amul), నంది మధ్య ఇటీవల సంయుక్త ఒప్పందం జరిగింది. పరస్పరం అవగాహనతో పనిచేయాలని కూడా అమిత్ షా (Amith shah)ప్రకటించారు. ఈ అంశాలను గుర్తు చేస్తూ కర్ణాటకకు చెందిన నందిని ఇక కనిపించకుండా బీజేపీ చేస్తుందని కాంగ్రెస్ చెబుతోంది. కనీసం 120 స్థానాల్లో ఈ స్లోగన్ పనిచేస్తోందని సర్వేల అంచనా. బీజేపీకి ఇదో పెద్ద డ్రా బ్యాక్ కానుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా పాల ఉత్పత్తిదారులు నిరసనలు చేస్తున్నారు. మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ ధర్నాలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమూల్ అమ్మకాలను నిలివేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. మాజీ సీఎం సిద్ధిరామయ్య ప్రతి సభలోనూ అమూల్ (Amul)గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ , అధికారంలోకి వస్తే దాన్ని బ్యాన్ చేస్తామని హామీ ఇస్తున్నారు. ఈ స్లోగన్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందని ఆ పార్టీ నమ్ముతోంది.
ముస్లిం రిజర్వేషన్ ను రద్దు
ఇక బీజేపీ ముస్లిం రిజర్వేషన్(Muslim Reservation) రద్దు ప్రకటన మీద గెలుపును ఆశిస్తోంది. హిందూ ఓటర్లను ఆకర్షిస్తూ అధికారంలోకి రావాలని చూస్తోంది. జనాభాలో 80శాతం ఉన్న హిందూ ఓటర్లను తొలి నుంచి బీజేపీ నమ్ముకుంది. అందుకే, దశాబ్దాలుగా ఉన్న ముస్లిం రిజర్వేషన్ ను రద్దు చేస్తూ సంచలన ప్రకటన చేసింది. ఆ మేరకు క్యాబినెట్ తీర్మానం కూడా చేసింది. దాన్ని సవాల్ చేస్తూ ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాయి. అయితే, ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్ ను ఒక్క లింగ, లింగాయత్ లకు ఇస్తామని బీజేపీ చెబుతోంది. ఒక వైపు మతం మరో వైపు కులం కార్డ్ ను బీజేపీ (Karnataka 2023) ప్రయోగించింది.
Also Read : Karnataka 2023 : ముస్లిం రిజర్వేషన్ల దుమారం
తొలి నుంచి లింగాయత్ లు కాంగ్రెస్ పార్టీ వైపు ఉండే బలమైన సామాజికవర్గం. ఆ వర్గాన్ని ఆకర్షించడానికి రెండుశాతం రిజర్వేషన్ ను ప్రకటించింది. అంతేకాదు, ఆ వర్గానికి చెందిన లీడర్లకు ఎక్కువ సీట్లను కూడా కేటాయించింది. మరో సామాజికవర్గం ఒక్క లింగ కు కూడా 2శాతం రిజర్వేషన్ ఇస్తూ ప్రకటన చేసింది. ఈ రెండు సామాజికవర్గాల మద్ధతు కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అయితే, లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్లర్ కు సీటు ఇవ్వకపోవడంతో బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వెళ్లారు. ఆయన ప్రభావం పడుతుందని సర్వేల అంచనా. కానీ, మతపరమైన రిజర్వేషన్లు తొలగించిన బీజేపీ వైపు హిందూ ఓటు బ్యాంకు వస్తే బీజేపీ అనూహ్య ఫలితాలను(Karnataka 2023) అందుకునే ఛాన్స్ ఉంది.
మొత్తం మీద సున్నితమైన ప్రాంతీయ, మత పరమైన హామీలతో కాంగ్రెస్, బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో(Karnataka 2023) తలపడుతున్నాయి. అమూల్ పేరుతో ప్రాంతీయవాదాన్ని కాంగ్రెస్ నమ్ముకుంది. ముస్లిం రిజర్వేషన్ల రద్దుతో మత వాదాన్ని బీజేపీ విశ్వసిస్తోంది. ఆ క్రమంలో కర్ణాటక ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారు? అనేది ఆసక్తికరంగా ఉంది.
Also Read : Karnataka Politics: కన్నడ నాట ఏ అంశం ఎవరికి కలిసొచ్చేనో ?