Erode East Byelection: కాంగ్రెస్ అభ్యర్థి ఇళంగోవన్‌కు కమల్ హాసన్ మద్దతు
వచ్చే నెల 27న తమిళనాడులోని ఈరోడ్ తూర్పు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక( Erode East yelection)లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (ఎస్‌పీఏ) అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ బరిలోకి దిగారు. రోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి బేషరతుగా మద్దతు ఇవ్వాలని నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నిర్ణయించుకున్నారు.
- Author : Gopichand
Date : 26-01-2023 - 10:36 IST
Published By : Hashtagu Telugu Desk
వచ్చే నెల 27న తమిళనాడులోని ఈరోడ్ తూర్పు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక( Erode East yelection)లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (ఎస్‌పీఏ) అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ బరిలోకి దిగారు. రోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి బేషరతుగా మద్దతు ఇవ్వాలని నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నిర్ణయించుకున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కనిపించారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను MNM ఒంటరిగా ఎదుర్కొన్నప్పటికీ, కమల్ హాసన్ కాంగ్రెస్‌కు మద్దతుగా వెళతారని ఈ సమయంలో ఊహాగానాలు వచ్చాయి.
ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్‌కు బేషరతుగా మద్దతు ఇవ్వాలని నటుడు కమల్ హాసన్‌కు చెందిన మక్కల్ నీది మైయం (ఎంఎన్‌ఎం) నిర్ణయించింది. అంతకుముందు సోమవారం (జనవరి 23) కమల్‌ను ఇలంగోవన్ కలుసుకుని మద్దతు కోరారు. తమ పార్టీ సభ్యులను సంప్రదించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఎంఎన్‌ఎం నాయకుడు ఇళంగోవన్‌కి తెలిపారు. బుధవారం (జనవరి 25) చెన్నైలో సమావేశమైన ఎంఎన్‌ఎం కార్యవర్గం కాంగ్రెస్ అభ్యర్థికి బేషరతుగా మద్దతు ఇవ్వాలని తీర్మానించింది.
కమల్ హాసన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఇలంగోవన్, లౌకికవాదం పట్ల ఆయనకున్న నిబద్ధతను ఈ చర్య తెలియజేస్తోందని అన్నారు. డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఎస్‌పిఎకు మద్దతిచ్చినందుకు హాసన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పాలక, కార్యనిర్వాహక మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. డిఎంకె నేతృత్వంలోని SPA అభ్యర్థి, నా స్నేహితుడు ఇలంగోవన్‌కు బేషరతుగా మద్దతు ఇవ్వాలని తాము ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్లు హాసన్ తెలిపారు.
డిఎంకె మద్దతు గల అభ్యర్థికి మద్దతివ్వడం గురించి అడిగిన ప్రశ్నకు కమల్ హాసన్ మాట్లాడుతూ.. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా, ఆహారంతో సహా ప్రజల జీవితంలోని ప్రతి అంశంలోకి చొరబాటు చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాడటానికి తాము చేతులు కలిపామని చెప్పారు.జాతీయ ప్రాముఖ్యత విషయానికి వస్తే విభేదాలను తొలగించుకోవాలని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇళంగోవన్ గతంలో హాసన్‌ను కలిశారు. అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ నాయకుడు అరుణాచలం నియమితులైనట్లు ఎంఎన్‌ఎం అధినేత ప్రకటించారు.