US Defence Minister : ‘నా కొడుకుకు మహిళలంటే చులకనభావం’.. కాబోయే రక్షణమంత్రిపై తల్లి విమర్శలు
పీట్ హెగ్సేత్ ప్రవర్తనా శైలి గురించి 2018 సంవత్సరంలో పెనెలోప్ హెగ్సేత్(US Defence Minister) తమకు పంపిన మెయిల్ వివరాలతో న్యూయార్క్‌టైమ్స్ సంచలన కథనాన్ని తాజాగా ప్రచురించింది.
- Author : Pasha
Date : 30-11-2024 - 3:06 IST
Published By : Hashtagu Telugu Desk
US Defence Minister : పీట్ హెగ్సేత్.. కాబోయే అమెరికా రక్షణ మంత్రి ఈయనే. డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు కావడంతో పీట్ హెగ్సేత్‌కు ఈ కీలక అవకాశం దక్కబోతోంది. జనవరి 20న ఆయన రక్షణ మంత్రిగా ప్రమాణం చేస్తారు. ఈ తరుణంలో పీట్ హెగ్సేత్‌పై స్వయంగా ఆయన తల్లి పెనెలోప్ హెగ్సేత్ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read :Liquor Prices Reduced : మందుబాబులకు గుడ్ న్యూస్.. మూడు మద్యం బ్రాండ్‌ల ధరలు తగ్గింపు
మహిళలతో తన కుమారుడు పీట్ హెగ్సేత్ ప్రవర్తన అరాచకంగా ఉంటుందని పెనెలోప్ హెగ్సేత్ సంచలన ఆరోపణలు చేశారు. అసలు విషయం ఏమిటంటే.. ఈ ఆరోపణలు ఇప్పటివి కావు. పీట్ హెగ్సేత్ ప్రవర్తనా శైలి గురించి 2018 సంవత్సరంలో పెనెలోప్ హెగ్సేత్(US Defence Minister) తమకు పంపిన మెయిల్ వివరాలతో న్యూయార్క్‌టైమ్స్ సంచలన కథనాన్ని తాజాగా ప్రచురించింది.
Also Read :Tiger Attack : పట్టపగలే పెద్దపులి దాడి.. రైతుకు తీవ్ర గాయాలు
2018లో పెనెలోప్ హెగ్సేత్ పంపిన మెయిల్‌లో.. ‘‘నువ్వు (పీట్ హెగ్సేత్) మహిళలతో దురుసుగా ప్రవర్తించావు. స్వలాభం కోసం స్త్రీలను చులకనగా చూశావు. వారిపై అవాస్తవాలు మాట్లాడావు. అందుకే నేను నిన్ను ఇక గౌరవించను. ఒక తల్లిగా కుమారుడి ప్రవర్తనపై మౌనంగా ఉండాలని అనుకున్నాను. కానీ నీ(పీట్ హెగ్సేత్) రెండో భార్య సమంత అనుభవించిన బాధ గురించి తెలుసుకొని తాళలేకపోయాను. ఒక మహిళగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా’’ అని ఆమె ప్రస్తావించారు. ‘‘నీ(పీట్ హెగ్సేత్) రెండో భార్య సమంత చాలామంచిది. పిల్లల పెంపకంలో ఆమె బాధ్యతాయుతంగా ఉంటుంది. అయినా ఆమెతో నువ్వు అసభ్యకరంగా ప్రవర్తించావు. నీ ప్రవర్తనతో మేమంతా విసిగిపోయాం. అయినా ఒక తల్లిగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’ అని పెనెలోప్ హెగ్సేత్ తన మెయిల్‌లో ప్రస్తావించారు. మొత్తం మీద ఈ కథనం ఇప్పుడు అమెరికాలో వైరల్ అవుతోంది.