Liquor Prices Reduced : మందుబాబులకు గుడ్ న్యూస్.. మూడు మద్యం బ్రాండ్‌ల ధరలు తగ్గింపు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం ధరలపై(Liquor Prices Reduced) ఓ కమిటీని నియమించారు.
- By Pasha Published Date - 01:36 PM, Sat - 30 November 24

Liquor Prices Reduced : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మందుబాబులకు శుభవార్త. మూడు ప్రముఖ మద్యం బ్రాండ్‌ల ధరలు తగ్గిపోయాయి. సగటున క్వార్టర్‌పై రూ.50 వరకు, ఫుల్ బాటిల్‌పై రూ.100 దాకా ధర తగ్గింది. ఈమేరకు తగ్గింపునకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే ఇప్పటికే మద్యం దుకాణాల్లో ఉన్న మూడు మద్యం బ్రాండ్లను పాత ధరకే అమ్ముతారు. దుకాణాలకు కొత్తగా వచ్చే స్టాక్‌కు మాత్రమే తగ్గిన ధరలు వర్తిస్తాయి. ధరలు తగ్గనున్న మద్యం బ్రాండ్ల జాబితాలో మాన్షన్ హౌస్(MH), రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ, యాంటీక్విటీ విస్కీ ఉన్నాయి. మాన్షన్ హౌస్(MH) క్వార్టర్ ధర రూ.440 నుంచి రూ.380కి తగ్గగా, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గింది. రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210కి తగ్గింది. దీని ఫుల్ బాటిల్ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గింది. యాంటీక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ.1,600 నుంచి రూ.1,400కు తగ్గింది.
Also Read :Tiger Attack : పట్టపగలే పెద్దపులి దాడి.. రైతుకు తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం ధరలపై(Liquor Prices Reduced) ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు మూడు బ్రాండ్ల ధరలను తగ్గించారు. త్వరలోనే మరో రెండు లిక్కర్ బ్రాండ్ల ధరలను కూడా తగ్గిస్తారని తెలుస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని విక్రయించలేదు. టీడీపీ సర్కారు ఏర్పడిన తర్వాతే ప్రముఖ బ్రాండ్ల మద్యం విక్రయానికి మళ్లీ తలుపులు తెరుచుకున్నాయి. ఏపీలో మద్యం విక్రయాల్లోకి నకిలీ బ్రాండ్ల చొరబాటుకు టీడీపీ సర్కారు అడ్డుకట్ట వేసింది. దీనివల్ల మందుబాబుల ఆరోగ్యానికి కొంత భరోసా ఏర్పడింది.