HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Dinesh Karthik The Rcb Finisher Like Abd

Dinesh Karthik: బెంగళూరుకు మరో ఏబీడీలా డీకే

దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఆర్సీబీ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కు భారత్‌లో ఉన్న ఫ్యాన్‌ ఫ్యాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

  • Author : Hashtag U Date : 19-04-2022 - 10:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dinesh Karthik Kkr Imresizer
Dinesh Karthik Kkr Imresizer

దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఆర్సీబీ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కు భారత్‌లో ఉన్న ఫ్యాన్‌ ఫ్యాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్‌ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా డీవిలియార్స్ క్రీజులో ఉంటే చాలు…ఎలాగైనా మ్యాచ్‌ను గెలిపిస్తాడనే నమ్మకం అభిమానులకు కలిగించాడు డివిలియర్స్. అయితే ఊహించనిరీతిలో గతేడాది ఐపీఎల్ ముగిసాక రిటైర్మెంట్ పలికాడు. అయితే అతని మెరుపు ఇన్నింగ్స్ లను మల్లి ఐపీఎల్ లో చూడలేము అనుకున్న ఆర్సీబీ అభిమానులకు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్ కార్తీక్‌ రూపంలో ఓ మ్యాచ్ ఫినిషర్ దొరికాడు. గత కొంత కాలంగా నిరాశలో ఉన్న ఆర్సీబీ అభిమానుకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తూ ఆర్సీబీ తరఫున అదరగొడుతున్నాడు.

ఐపీఎల్ 2021 సీజన్ వరకూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున బరిలోకి దిగిన దినేశ్‌ కార్తిక్‌ను ఐపీఎల్‌ 15వ సీజన్ మెగా వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ రూ. 5 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇందుకు తగినట్లుగా నిలకడగా రాణిస్తున్న దినేశ్‌ కార్తిక్‌ ఆర్సీబీ జట్టు విజయాల్లో ఫినిషర్ రోల్ పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 209.57 స్ట్రయిక్‌ రేట్‌తో197 పరుగులు సాధించాడు. బెంగళూరు తరఫున ఒత్తిడి పరిస్థితుల్లోనూ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ చెలరేగుతున్న దినేష్ కార్తీక్ అచ్చం ఏబీ డివిలియర్స్ పాత్రను పోషిస్తున్నాడు. అలాగే వికెట్ కీపర్‌గా ఉంటూనే బౌలర్లకు, ఫీల్డర్లకు కీలక సూచనలు చేస్తున్నాడు. దీంతో అటు బ్యాట్స్‌మన్‌గానే వికెట్ కీపర్‌గా, ఫినిషర్‌గా రాణిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. దినేష్ కార్తీక్‌ రాబోయే మ్యాచుల్లో కూడా ఇలాగే చెలరేగితే ఈసారి ఆర్సీబీ ట్రోఫీ గెలవడం ఖాయమంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dinesh Karthik
  • IPL 2022
  • rcb
  • royal challengers bengaluru

Related News

RCB

ఐపీఎల్ 2026.. హోం గ్రౌండ్ మార్చుకోనున్న ఆర్‌సీబీ!

ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, KSCAకి ఇవ్వాల్సిన ఆదేశాలపై బుధవారం జరిగే సమావేశంలో సీనియర్ అధికారులు, పోలీసులు, న్యాయ నిపుణులు చర్చించనున్నారు.

  • WPL 2026 Prize Money

    ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 విజేత ఆర్సీబీ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?!

Latest News

  • Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • RBI New Rules : లోన్ రికవరీ ఏజెంట్లకు షాక్ ఇచ్చిన RBI ..జులై 1 నుంచి కొత్త రూల్స్

  • Kiss day: ఒక్కో చోట ఒక్కో ముద్దుకు ఎంతో ప్రత్యేకం..అదేంటో తెలుసుకోండి !!

  • Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

Trending News

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd