Canada: దేవాలయం పై భారత్ వ్యతిరేక నినాదాలు..ఎక్కడో తెలిస్తే షాక్..!!
కెనడాలో నారాయణస్వామి ఆలయా గోడలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.
- By hashtagu Published Date - 09:51 AM, Thu - 15 September 22

కెనడాలో నారాయణస్వామి ఆలయా గోడలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనను కెనడాలోని భారత హైకమిషన్ ఖండించింది. అధికారులతో చర్చించి నేరస్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. కెనడాలోని భారత హైకమిషన్ ట్వీట్ చేస్తూ, ‘భారత వ్యతిరేక గ్రాఫిటీతో BAPS స్వామినారాయణ్ మందిర్ ను అపవిత్రం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ట్వీట్ చేసింది.
అధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామంటూ ట్వీట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆలయం అక్కడ ఆలయ గోడలపై ఖలిస్తానీ నినాదాలు రాశారు. కాగా ఈ ఘటనపై బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రకమైన ద్వేషాలకు కెనడాలో స్థానం లేదన్నారు. బాధ్యులను త్వరగా శిక్షిస్తామని తెలిపారు. తరచుగా ఇలాంటి ఘటనలు జరగుతుండటంతో అక్కడున్న హిందువులు ఆందోళన చెందుతున్నారు.
Very disappointed to hear of the vandalism that occurred at the BAPS Swaminarayan Mandir in Toronto. This type of hate has no place in the GTA or Canada. Let’s hope those criminals responsible are brought to justice quickly.
— Patrick Brown (@patrickbrownont) September 14, 2022
We strongly condemn defacing of BAPS Swaminarayan Mandir Toronto with anti-India graffiti. Have requested Canadian authorities to investigate the incident and take prompt action on perpetrators. @MEAIndia @IndiainToronto @PIB_India @DDNewslive @CanadainIndia @cgivancouver
— India in Canada (@HCI_Ottawa) September 15, 2022
Vandalism of Toronto BAPS Shri Swaminarayan Mandir by Canadian Khalistani extremists should be condemned by all
This is not just an isolated event. Canadian Hindu temples have been targeted in the recent past by these kinds of hate crime
Hindu Canadians are legitimately concerned— Chandra Arya (@AryaCanada) September 15, 2022
Related News

Trudeau: భారత్ తో వివాదం మాకు ఇష్టం లేదు.. కెనడా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
ఖలిస్తానీ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Trudeau) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.