300 CRORE BUNGALOW : ఇట్లు..ఝున్‌ఝున్‌వాలా 300 కోట్ల ఇల్లు
ఇండియాలో స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్లకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేని పేరు.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా!! ఈ స్టాక్ మార్కెట్ కింగ్ ఎంతగా సంపాదించాడో వేరే చెప్పనక్కర లేదు . ఆయన ఎన్నో ఇళ్ళు కొన్నారు.. ఎన్నో ఇళ్ళు కట్టించుకున్నారు.. ఫ్యామిలీ బాగు కోసం ఝున్‌ఝున్‌వాలా ఎంతో తాపత్రయపడ్డారు. అయితే ఎన్ని సొంత ఇళ్ళు ఉన్నా.. ఆయనకు ఒక ఇల్లు అంటేనే మహా ఇష్టమట. రూ.371 కోట్లతో(300 CRORE BUNGALOW) ముంబై మలబార్ హిల్స్ ప్రాంతంలోని అరేబియా సముద్ర తీరంలో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తన రాయల్ టేస్ట్ కు తగ్గట్టు కట్టించుకున్న 14 అంతస్తుల బిల్డింగ్ లోనే రాకేశ్ ఎక్కువ సేపు ఉండేవారట.
- By pasha Published Date - 02:03 PM, Sun - 14 May 23

ఇండియాలో స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్లకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేని పేరు.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా!! ఈ స్టాక్ మార్కెట్ కింగ్ ఎంతగా సంపాదించాడో వేరే చెప్పనక్కర లేదు . ఆయన ఎన్నో ఇళ్ళు కొన్నారు.. ఎన్నో ఇళ్ళు కట్టించుకున్నారు.. ఫ్యామిలీ బాగు కోసం ఝున్‌ఝున్‌వాలా ఎంతో తాపత్రయపడ్డారు. అయితే ఎన్ని సొంత ఇళ్ళు ఉన్నా.. ఆయనకు ఒక ఇల్లు అంటేనే మహా ఇష్టమట. రూ.371 కోట్లతో(300 CRORE BUNGALOW) ముంబై మలబార్ హిల్స్ ప్రాంతంలోని అరేబియా సముద్ర తీరంలో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తన రాయల్ టేస్ట్ కు తగ్గట్టు కట్టించుకున్న 14 అంతస్తుల బిల్డింగ్ లోనే రాకేశ్ ఎక్కువ సేపు ఉండేవారట. ఆయన చనిపోయే ముందు చివరి రోజులు కూడా ఈ బంగళాలోనే గడిపారు. ఈ ఇంటిలోని టెర్రస్ పై నుంచి సముద్రం బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. టెర్రస్ పై గెజిబో ఉంది. గెజిబోలో బార్, అవుట్‌డోర్ సీటింగ్ ప్రాంతాలు, పచ్చని గడ్డి కార్పెట్ ఉన్నాయి. అక్కడ కూర్చుంటే అరేబియా సముద్రం అద్భుత దృశ్యం కనిపిస్తుంది. ఈ బంగ్లాలోని నాలుగో అంతస్తులో పార్టీలకు ఉపయోగపడే బాంకెట్ హాల్ కూడా ఉంది. ఎనిమిదో అంతస్తులో ఆధునిక వ్యాయామశాల, ఆవిరి గది, స్పా, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబం ఈ బంగ్లాలోని కొన్ని అంతస్తులలో నివసిస్తుంది. 2016 ,2017 మధ్య కాలంలో ఈ బంగ్లాను నిర్మించాలనుకొని.. అప్పటివరకు ఆ ప్లేస్ లో ఉన్న రిడ్జ్‌వే అపార్ట్‌మెంట్‌లను ఝున్‌ఝున్‌వాలా కొన్నారు. దాన్ని కూల్చి వేయించి కొత్తది కట్టించారు.
Rakesh Jhunjhunwala’s Terrace #RJ #Investing pic.twitter.com/PPfWbTVdHB
— Rajiv Mehta (@rajivmehta19) May 11, 2023
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా స్నేహితుల్లో ఒకరైన రాజీవ్ మెహతా ఇటీవల రూ.371 కోట్ల(300 CRORE BUNGALOW) బంగళా టెర్రస్ వీడియోను తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. దీనికి 3.50 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ పోస్ట్ కు శంకర్ శర్మ అనే నెటిజన్ స్పందించాడు. “ నేను రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్ ను మిస్ అవుతున్నా.. ఈ ఇంటి పక్కనే మా ఇల్లు ఉంది.ఝున్‌ఝున్‌వాలా ఇంటి ముందున్న తెల్లటి టవర్, టాప్ 3 అంతస్తుల పెంట్ హౌస్ నాదే” అని కామెంట్ పెట్టాడు. ప్రముఖ పెట్టుబడిదారు రాకేష్ జున్‌జున్‌వాలా 2022 ఆగస్టులో 62 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య ఝున్‌ఝున్‌వాలా ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు.

Tags
- 14 storey bungalow
- Jhunjhunwala 300 crore bungalow
- Malabar Hills area
- mumbai
- Rakesh Jhunjhunwala
- sea facing

Related News

Mumbai: “ముంబైని అతి త్వరలో పేల్చబోతున్నా”.. పోలీసుల అదుపులో నిందితుడు
మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లో మరోసారి భయాందోళనకు గురవుతారని పోలీసులకు బెదిరింపులు వచ్చాయి.