Tractor Accident: డ్రైవర్ లేకుండా దూసుకెళ్లిన ట్రాక్టర్, చక్కర్లు కొడుతున్న వీడియో!
డ్రైవర్ లేకుండా ఓ ట్రాక్టర్ దూసుకెళ్లిపోయింది. ఓ షాపులోకి వెళ్లడంతో అద్దాలు, బైక్ ధ్వంసమయ్యాయి.
- By Balu J Updated On - 03:34 PM, Sat - 4 March 23

ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. బిజ్నోర్‌లోని ఒక షోరూమ్‌లోకి ట్రాక్టర్ (Tractor) దానంతట అదే స్టార్ట్ ఓ షాపులోకి దూసుకుపోయింది. దీంతో షాపు (Shop) అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో (Video)ను చూసిన నెటిజన్స్ ట్రాక్టర్‌లో దెయ్యం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.
షాపులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ (Tractor) బైక్‌ను ఢీకొట్టడంతో పాటు సైకిల్‌ను తునతునకలు చేసింది. సకాలంలో స్పందించిన ఓ వ్యక్తి బ్రేక్ వైర్స్ కట్ చేయడంతో ప్రమాదం తప్పింది. అయితే ఓ వ్యక్తి ట్రాక్టర్ (Tractor)పై వచ్చి తన వాహనాన్ని చెప్పుల దుకాణం బయట పార్క్ చేశాడు. అయితే సుమారు గంటసేపు ఆ స్థలంలో నిశ్చలంగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ షాపులోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని షాప్ మేనేజర్ ట్రక్కు యజమానిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
#टैक्टर_पर_भूत…!#Bijnor में जूते के शो- रूम के सामने खड़ा ट्रैक्टर अचानक से अपने आप स्टार्ट होकर शीशा तोड़ते हुए शो- रूम में घुस गया,जबकि ट्रैक्टर पर कोई बैठा नहीं था. पूरी घटना #CCTV फुटेज में कैद…#Ghost pic.twitter.com/GOch3jruQf
— Tushar Rai (@tusharcrai) March 1, 2023
Also Read: Dog Bite Cases: రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. రోజుకు 100 కేసులు!

Related News

Kota Srinivasa Rao: నేను చనిపోలేదు.. బతికే ఉన్నా: కోట క్లారిటీ
కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) మరణించారని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.