Man and Two Wifes: ఒక భార్య వద్ద 3 రోజులు.. మరో భార్య వద్ద 3 రోజులు: గ్వాలియర్ కోర్టు షాకింగ్ తీర్పు!
ఇద్దరి భార్యల విషయంలో గ్వాలియర్ కోర్టు (Court) షాకింగ్ తీర్పు ఇచ్చింది.
- By Balu J Published Date - 12:17 PM, Wed - 15 March 23

సమాజంలో ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు (2 Marriages) చేసుకోవడం కామన్ గా మారింది. ఇద్దరి భార్యల మధ్య అవగాహన ఉంటే ఎలాంటి సమస్యలు రావు. భర్త కూడా సమప్రాధాన్యం ఇస్తే సంసారం హాయిగా సాగుతుంది. కానీ భర్త ఓ భార్య దగ్గర గడిపోతే మాత్రం కచ్చితంగా సమస్యలు తలెత్తుతాయి. కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వస్తోంది. ఇద్దరి భార్యల విషయంలో గ్వాలియర్ కోర్టు (Court) షాకింగ్ తీర్పు ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన వ్యక్తి హర్యానాలో ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 2018లో గ్వాలియర్ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. 2020లో కరోనా లాక్‌డౌన్ సమయంలో భార్యను అతడు పుట్టింటికి పంపాడు. ఆ తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ అతడు తన భార్యను ఇంటికి తీసుకురాకుండా హర్యానా వెళ్లిపోయాడు. అక్కడ తన సహోద్యోగి అయిన మరో మహిళను పెళ్లి (2 Marriages) చేసుకున్నాడు.
మరోవైపు, భర్త వస్తాడని, తనను తీసుకెళ్తాడని చూసి చూసి విసిగిపోయిన మొదటి భార్య చివరికి తనే హర్యానా వెళ్లింది. అక్కడ తన భర్త మరో మహిళతో కాపురం చేస్తుండడంతో విస్తుపోయింది. ఆ తర్వాత గ్వాలియర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం వారికి ఆరు నెలలపాటు కౌన్సెలింగ్ ఇచ్చింది. చివరికి ముగ్గురితో కలిసి చర్చలు జరిపిన తర్వాత భార్యలు ఇద్దరు (2 Marriages) అతడితో కలిసి ఉండేందుకు అంగీకరించడంతో భర్తను కోర్టు సమానంగా విభజించింది. ఒక భార్య వద్ద మూడు రోజులు, మరో భార్య దగ్గర మూడు రోజులు గడిపాలని, ఆదివారం మాత్రం అతడి ఇష్టమని ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన భర్త భార్యలిద్దరికీ చెరో ఫ్లాట్ కొనిచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
Also Read: Ananya Panday Smoking: సిగరెట్ తాగిన అనన్య పాండే.. లైగర్ బ్యూటీ ఫొటో వైరల్
Related News

Marriage Vs Individual Privacy : భర్త వ్యక్తిగత సమాచారాన్ని భార్యకు చెప్పక్కర్లేదు : హైకోర్టు
Marriage Vs Individual Privacy : భర్త తన వ్యక్తిగత వివరాలను భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.