Ananya Panday Smoking: సిగరెట్ తాగిన అనన్య పాండే.. లైగర్ బ్యూటీ ఫొటో వైరల్
కథానాయికలు సైతం కొన్ని అలవాట్లున్నాయి. కొందరు స్మోకింగ్ (Smoking) కు అలవాటు పడినవాళ్లున్నారు.
- Author : Balu J
Date : 15-03-2023 - 11:42 IST
Published By : Hashtagu Telugu Desk
సినిమా (Cinema) అంటే ఓ రంగుల ప్రపంచం.. ఆ రంగుల ప్రపంచంలో ప్లసులుంటాయి. మైనస్ లు కూడా ఉంటాయి. నిత్యం కెమెరాలు, లైట్ల వెలుతురులో గడిపే స్టార్స్ కు సైతం వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే కొందరు మద్యం, సిగరెట్ కూడా తాగుతుంటారు. అయితే ఈ తరం హీరోయిన్స్ కు హీరోలకు మించి కష్టపడుతుంటారు. కథానాయికలు సైతం కొన్ని అలవాట్లున్నాయి. కొందరు స్మోకింగ్ (Smoking) కు అలవాటు పడినవాళ్లున్నారు.
తాజాగా లైగర్ బ్యూటీ (Ananya Panday) కి స్మోకింగ్ అలవాటు ఉందని తెలుస్తోంది. అనన్య (Ananya Panday) పాండేకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె కజిన్ అలన్నా పాండే మెహందీ వేడుకలో సిగరెట్ తాగుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. తన కుటుంబంతో కలిసి వేడుకకు హాజరైనప్పుడు సిగరెట్ పట్టుకుని కనిపించడం అందర్నీ షాక్ కు గురిచేసింది. అయితే ఓ నెటిజన్స్ ఇప్పటికే చిత్రాన్ని స్క్రీన్‌షాట్ తీసి పోస్ట్ చేసారు. “అనన్య స్మోకర్ అవుతుందని నేను ఊహించలేదు” అని కొందరు రియాక్ట్ అయ్యారు.
“నా అనన్య ఇలా ఉండకూడదు” అని మరికొందరు రియాక్ట్ అయ్యారు. “వావ్, నాకు తెలియదు. ఆమె అందమైన పెదవులు చాలా అందంగా ఉంటాయి. ఆమె స్మోకర్ అని నేను నమ్మలేకపోతున్నాను. పాడు ఇంకొందరు నెటిజన్స్ స్పందించారు. ఏదేమైనా ప్రస్తుతం అనన్య (Ananya Panday) పిక్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
Also Read: NTR’s Pathala Bhairavi: ఎన్టీఆర్ ని స్టార్ ని చేసిన ‘పాతాళ భైరవి’.. నేటికి 72 ఏళ్లు!