TS Scholarship : విద్యార్థులకు అలర్ట్…స్కాలర్ షిప్ దరఖాస్తు ప్రక్రియ షురూ..అప్లై చేసుకోండి ఇలా..!!
తెలంగాణ విద్యార్థులు బీసీ సంక్షేమ శాఖ, మహాత్మాజ్యోతిబా పూలే, బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద బీసీ, ఈబీసీ విద్యార్థులు ఆర్థిక సాయం పొందేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
- Author : hashtagu
Date : 03-09-2022 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ విద్యార్థులు బీసీ సంక్షేమ శాఖ, మహాత్మాజ్యోతిబా పూలే, బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద బీసీ, ఈబీసీ విద్యార్థులు ఆర్థిక సాయం పొందేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద విదేశాల్లో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించడానికి అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ విద్యా సంవత్సరానికి ఆగస్టు లేదా సెప్టెంబర్ సెషన్ కుక సంబంధించి అభ్యర్థులు నమోదు చేసుకునేందుకు తేదీ 01.09.2022న రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. చివరి తేది 30.09.2022న ముగుస్తుంది. ఇతర వివరాల కోసం ఆన్ లైన్ అప్లికేషన్స్ పొందేందుకు http://www.telanganaepass.cgg.gov.in అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించగలరని ఓ ప్రకటనలో తెలిపారు.
స్కాలర్ షిప్స్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
దశ 1: అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా http://www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ను తెరవాలి.
దశ2: తర్వాత Overseas Scholarship Services అప్షన్ పై క్లిక్ చేయండి.
దశ 3: తర్వాత Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi for BC and EBC students విభాగంలో Registration అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
దశ 4: ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. వివరాలను నమోదు చేసి.. సూచించిన ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయండి.
దశ 5: తర్వాత నమోదు పై క్లిక్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోండి.