Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగుస్తున్న ఉచ్చు..సన్నిహితుల ఇండ్లపై ఈడీ రెయిడ్స్..!!
ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీతోపాటు గుర్ గావ్, లక్నో, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే 30చోట్ల ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
- By hashtagu Published Date - 11:03 AM, Tue - 6 September 22
ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీతోపాటు గుర్ గావ్, లక్నో, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే 30చోట్ల ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రన్ పిళ్లై నివాసంతోపాటు ఆఫీసు, రాబిన్ డిస్టిల్లరీలోనూ దాడులు జరుగుతున్నాయి. అతనితో సంబంధం ఉన్న అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాల్లోనూ దాడులు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ కుంభకోణంలో టీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తం ఉందంటూ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అభిషేక్ రావు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వర్గాలు తెలపడం గమనార్హం. కవితకు అభిషేక్ రావు సన్నిహితుడిగా ఉండటంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఈ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉందని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీలాండరిగ్ జరిగినట్లు కూడా అనుమానాలు తలెత్తడంతోనే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే ఏక కాలంలో 6 నగరాల్లో సోదాలు జరుగుతున్నాయి.