Vastu Tips : ఇల్లు కొంటున్నారా? వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి…లేదంటే నష్టాన్ని భరించాల్సి వస్తుంది..!!
కొత్త ఇల్లు కొనాలని చాలా మంది కలలు కంటారు. కానీ ఇల్లు కొనుగోలు చేసేముందు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి.
- By hashtagu Published Date - 08:20 PM, Tue - 11 October 22
కొత్త ఇల్లు కొనాలని చాలా మంది కలలు కంటారు. కానీ ఇల్లు కొనుగోలు చేసేముందు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. కొంతమంది అవేం పట్టించుకోకుండా..కొనేస్తుంటారు. భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అయితే మీరు కొత్తగా ఇల్లును కొనుగోలుచేసే ముందు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.
1) ఇంటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి
మొదటి సారి ఆస్తి కొనుగోలు:
మీరు వేరొకరి ఇంటిని కొనుగోలు చేస్తుంటే, దానికంటే ముందు అతని ఆస్తికి నిజమైన యజమాని ఎవరు.. ఆ ఇల్లు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉందో తెలుసుకోవాలి. అలాగే ఆ ఇంటి గురించిన పూర్తి సమాచారం మీ వద్ద ఉంటే ఆ ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే, మీరు ఇంటికి సంబంధించిన అన్ని పత్రాలను తీసుకోవాలి. ఇవే కాకుండా ఇల్లును ఏ సంవత్సరంలో నిర్మించారన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.
2) సమీప మార్గాలు, దూరాన్ని తెలుసుకోండి
మీరు కొత్త స్థలంలో ఇల్లు కొంటున్నట్లయితే..ఆ ఇంటి చుట్టూ మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మీ ఇల్లు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో మీకు తెలుస్తుంది. దీనితో పాటు, మీరు మీ కుటుంబంతో నివసిస్తున్నట్లయితే, పిల్లల కోసం పాఠశాల మీ ఇంటికి ఎంత దూరంలో ఉందో కూడా మీరు తెలుసుకోవాలి.
3) ఇల్లు ఎంత ఖరీదైనది?
మీరు ఇల్లు కొనుగోలు చేసేందుకు ఎంత అవుతుంది. ఇంటి కోసం లోన్ తీసుకున్నట్లయితే…ప్రతి నెలా ఈఎంఐ ఎంత కట్టాలన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. ఇలా చేస్తే మీరు సంపాదించిన దాంట్లో నుంచి ఈఎంఐకు కొంత చెల్లిస్తే కొంత పొదుపు చేసుకోవచ్చు.
ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, మీరు మీ కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి.
Related News
Budget 2024 : హోమ్ లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పబోతున్న బడ్జెట్..?
2024 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ (Budget 2024) ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు గప్పెడు ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే 2024లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తెలపడం అన్నమాట. కాబట్టి ఓ విధంగా బిజెపి సర్కారుకు ఈ పర్�