Dry Ginger : శొంఠి ఇంట్లో ఉంటే, ఒంట్లో మేలు ఎలాగో తెలుసుకోండి..!!
చిన్నపాటి జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగెడతాం. ఎంత వైద్యుడి దగ్గరకు వెళ్లినా...మనస్సు మాత్రం ఇంట్లో ఉండే చిట్కాలపైన్నే కొట్టుకుంటుంది.
- By hashtagu Published Date - 03:23 PM, Fri - 14 October 22

చిన్నపాటి జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగెడతాం. ఎంత వైద్యుడి దగ్గరకు వెళ్లినా…మనస్సు మాత్రం ఇంట్లో ఉండే చిట్కాలపైన్నే కొట్టుకుంటుంది. అలాంటి సందర్భంలో మనకు వెంటనే అల్లం గుర్తుకువస్తుంది. ఎందుకంటే ఇది ఉష్ణపదార్థం. జలుబు, దగ్గు, జ్వరం వచ్చిందనుకోండి…కాస్త అల్లం ముక్క నోట్లో వేసుకుని నమిలితే…దెబ్బకు రోగాలన్నీ పరార్ అవుతాయి. ఇదే సింపుల్ టెక్నిక్. అయితే పచ్చి అల్లం కాకుండా ఎండు అల్లం ( శొంఠి) తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
వాతం తగ్గుతుంది
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..పచ్చి అల్లం మానవ శరీరంలో వాతాన్ని పెంచుతుంది. అయితే శొంఠి దానిని సమతుల్యం చేస్తుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ లేదా అపానవాయువు విషయంలో పచ్చి అల్లంతో అల్లం టీని తాగకూడదు. బదులుగా నీటిలో శొంఠి కలుపుకుని తాగాలి.
మలబద్దకాన్ని నివారిస్తుంది
మలబద్ధకం బాధితులు..పదేపదే ఈ సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో శొంఠిని చేర్చుకోవాలి. దీని ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే కదలడానికి ఇబ్బందిగా ఉండే స్త్రీ, పురుషులు ఖాళీ కడుపుతో శొంఠి నీటిని తాగాలి.
శొంఠిని ఏడాది పొడవునా వాడుకోవచ్చు!
పచ్చి అల్లం సరిగ్గా నిర్వహించకపోతే కుళ్లిపోతుందని మీ అందరికీ తెలుసు. కాబట్టి వీలైనంత త్వరగా వాడాలి. కానీ ఎండు అల్లం అలా కాదు. మనం ఇంట్లోనే అల్లం తెచ్చి ఎండబెట్టి ఏడాది పొడవునా వాడుకోవచ్చు. ఇది పొడిగా ఉన్నందున, దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగానూ తగ్గవు. కాబట్టి ఎండు అల్లం ఉత్తమం. ఇది కఫాన్ని కరిగిస్తుంది. జలుబు చేస్తే పచ్చి అల్లం వేసుకుని టీ చేసి తాగినా, పచ్చి అల్లం వాడినా ఆహార పదార్థాల్లో కఫం పెరుగుతుందనేది మనకు తెలియని వాస్తవం. కానీ ఇలాంటప్పుడు శొంఠిని వాడటం వల్ల మన సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
శొంఠి ఎలా ఉపయోగించాలి?
రెండు గ్లాసుల నీటిని స్టౌ మీద మరిగించి.. అందులో ఒక అంగుళం శొంఠి వేసి, నీరు సగానికి తగ్గే వరకు బాగా మరిగించాలి. అప్పుడు ఆ నీటిని చల్లార్చి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.