చలికాలంలో చుండ్రు పెరగడానికి కారణాలు ఇవే.. చుండ్రును తగ్గించుకోవడం కోసం ఏం చేయాలో మీకు తెలుసా?
మిగతా సీజన్లతో పోల్చుకుంటే చలికాలంలో చుండ్రు పెరగడానికి గల కారణాలు ఏమిటి? మరి ఈ చుండ్రు తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 16-12-2025 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
- చలికాలంలో చుండ్రును తగ్గించే చిట్కాలు
శీతాకాలంలో చుండ్రు సమస్య మరింత పెరగడానికి గల కారణాలు
చుండ్రును తగ్గించే అద్భుతమైన చిట్కాలు
Winter Dandruff: చలికాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిలో చుండ్రు సమస్య కూడా ఒకటి. తలలో పొలుసులు రాలడం, దురద, చికాకు పెరుగుతాయి. దీనివల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, చాలా మందికి చుండ్రు సమస్య అనేది వస్తుంటుంది. మిగతా సీజన్ల కంటే చలికాలంలో ఈ చుండ్రు సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శీతాకాలంలో గాలి సహజంగా పొడిగా ఉంటుంది. దీనివల్ల స్కాల్ప్ నుంచి తేమ తొలగుతుంది. దీనివల్ల స్కాల్ప్ పై చికాకు ఏర్పడి పొలుసులకు గురవుతుందట.
తేమ లేకపోవడం వల్ల స్కాల్ప్ దాని సహజ నూనెలను కోల్పోయి పొడిబారేలా చేసి చుండ్రుకు కారణమవుతుందని, సూర్యరశ్మి తగ్గడం, శరీరం విటమిన్ డి ని ఉత్పత్తి చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని, కాబట్టి రోజూ కాసేపు ఎండలో ఉండేందుకు లేదా విటమిన్ డి సప్లెమెంట్స్ తీసుకునేందుకు ప్రయత్నించాలని చెబుతున్నారు. స్కాల్ప్ బిగుతుగా ఉండి చిన్న తెల్లటి పొలుసులు ఉంటే అది పొడిబారడం. కానీ పొలుసులు జిడ్డుగా, పసుపు రంగులో, దురదగా లేదా ఎరుపు రంగుతో వస్తే అది చుండ్రు అని చెబుతున్నారు. స్కాల్ప్ పొడిగా ఉంటే చాలామంది నూనె ఎక్కువగా అప్లై చేస్తారు. అయితే నూనె జుట్టును తేమగా ఉంచినా చుండ్రును మరింత పెంచుతుందట. అధికంగా నూనె వాడడం వల్ల ఫోలికల్స్ మూసుకుపోయి పొలుసులు మరింత పెరుగుతాయట.
తేలికపాటి నాన్ కామెడోజెనిక్ నూనెలను ఉపయోగించి వారానికి ఒకసారి మాత్రమే నూనె అప్లై చేస్తే చాలు అని చెబుతున్నారు. నూనెకు బదులు స్కాల్ప్ సీరమ్ ఉపయోగించవచ్చట. నూనెల వలె కాకుండా ఇవి రంధ్రాలను మూసుకుపోకుండా స్కాల్ప్ కు చికిత్స చేయడానికి హెల్ప్ చేస్తాయట. అయితే సీరమ్స్ ఎంచుకునేప్పుడు కొన్ని చెక్ చేసుకోవాలట. ఏ టైప్ సీరమ్ ఏయే జుట్టు సమస్యలను దూరం చేస్తుంది అన్న విషయాలను తెలుసుకోవాలని, సాలిసిలిక్ యాసిడ్ పొలుసులను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుందని, చుండ్రు కలిగించే ఈస్ట్ ను నియంత్రించడానికి జింక్ పిరిథియోన్, చుండ్రు తగ్గించడం కోసం కెటోకానజోల్, హెయిర్ ట్రీట్మెంట్ కి టీ ట్రీ ఆయిల్, స్కాల్ప్ అవరోధాన్ని బలోపేతం చేయడానికి నియాసినమైడ్ సీరమ్స్ ఎంపిక చేసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే వేడి నీటి స్నానాలు, అధికంగా జుట్టు వాష్ చేస్తే చుండ్రు పెరుగుతుందట. చుండ్రును మరింత పెంచుతాయట. కాబట్టి స్కాల్ప్ శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఒమేగా 3లు, జింక్, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఒత్తిడి కూడా తగ్గించుకోవాలట.