HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Will You Lose Weight If You Eat Sitting On The Floor

Eating Habit: నేల మీద కూర్చుని తింటే బరువు తగ్గుతారా?

గతంలో ఇంటిళ్లపాది నేల మీద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుని భోజనం చేసేవారు.

  • Author : Maheswara Rao Nadella Date : 04-12-2022 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sitting On Floor
Sitting On Floor

గతంలో ఇంటిళ్లపాది నేల మీద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుని భోజనం చేసేవారు. ఈ జనరేషన్‌ వాళ్లకు డైనింగ్‌ టేబుల్స్‌ అలవాటై కింది కూర్చోని తినడానికి అంతగా ఇష్టపడటం లేదు. పూర్వకాలంలో మహారాజులు కూడా కింద కూర్చునే భోజనం చేసేవారు. ఇప్పటికీ గ్రామాల్లో చాలా మంది కింద కూర్చునే భోజనం చేస్తారు. నేల మీద కూర్చుని భోజనం చేస్తే సౌకర్యంగానే కాదు, ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

జీర్ణక్రియ మెరుగవుతుంది:

Digestive Track

నేల మీద కూర్చుని భోజనం చేస్తే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేలపై కూర్చుని తినేటప్పుడు ముందుకు వంగి తిరిగి అసలు భంగిమకు వస్తాం. దీని వల్ల జీర్ణ రసాలు బాగా విడుదల అవుతాయి. ఇవి ఆహారం సులభంగా జీర్ణం కావడంలో కీలకపాత్ర వహిస్తాయి. తద్వారా శరీరానికి కావలసినంత శక్తి అందుతుంది. మనం భోజనం చేయడానికి నేల మీద కాళ్లు మడిచి కూర్చున్నప్పుడు మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇది జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తుంది.

మీ భంగిమను సరిచేస్తుంది:

ఇంట్లో భంగిమ వ్యాయామాలు - సమర్థవంతమైన వ్యాయామాలు మరియు మొత్తం సముదాయాలు  మాత్రమే! నేరుగా భంగిమను పునరుద్ధరించడానికి వ్యాయామాల సమితి

మనం భోజనం చేసేప్పుడు సరైన భంగిమలో కూర్చోవడం చాలా ముఖ్యం. మనం తినేటప్పుడు సరైన పోస్చర్‌లో కూర్చుంటే మన కండరాలు, కీళ్ళు, మోకాలు, వీపు, మెడ, చేతులపై అధిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. నేల మీద కూర్చున్నప్పుడు మన భంగిమ ఆటోమెటిక్‌గా సరవుతుంది. మన వీపును నిటారుగా చేస్తంది, వెన్నముకను నిటారుగా ఉంచుతుంది, మన భుజాన్ని వెనక్కు నెట్టుతుంది.

బరువు తగ్గుతారు:

Weight loss tips: Fitness experts share natural ways to get rid of belly fat  | Health - Hindustan Times

నేల మీద కూర్చుని తింటే మన బరువు కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది డైనింగ్ టేబుల్ పైన కూర్చుని ఎంత తిన్నామో తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. దీనివల్ల బరువు పెరుగుతారు. మనకు సరిపోయేంత తిన్నామా? లేదా? అనే విషయం తెలియడానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్‌ను అందించే ఒక నాడి ఉంటుంది. డైనింగ్ టేబుల్‌పై కూర్చొని తినడం కంటే కింద కూర్చొని తినడం వల్ల ఈ నాడి మరింత సమర్థంగా పనిచేస్తుంది. దీంతో మనం సరిపడా ఆహారం మాత్రమే తింటాం దీంతో బరువు కంట్రోల్‌లో ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

మీ మైండ్ రిలాక్స్‌ అవుతుంది:

Meditation Not Working? 5 Easy Hacks to Relax the Mind - Influencive

నేల మీద సుఖాసనంలో కూర్చుని భోజనం చేస్తే ఫోకస్‌ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం ఆటోమెటిక్‌గా మనం చేసే పని మీద శ్రద్ధ చూపేలా చేస్తుంది. మనస్సు నుంచి ఒత్తిడి తగ్గిస్తుంది. సుఖాసనంలో కూర్చుని భోజనం చేస్తే శరీరంలో ఆక్సిజన్‌ సర్క్యులేషన్‌ పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

జీవిత కాలం పెరుగుతుంది:

Could This New Discovery Increase the Life Span of Patients Diagnosed with  Prostate Cancer? - European Medical Journal

నేల మీద కూర్చుని తింటే మన జీవితకాలన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం సుఖాసనం పై కూర్చుని ఏ సపోర్ట్‌ లేకుండా మనం పైకి లేవగలిగే వ్యక్తులు ఎక్కువకాలం జీవిస్తారు. సుఖాసనం నుంచి లేవడానికి బలం, స్టామినా అవసరం.

రక్తప్రసరణ మెరుగవుతుంది:

Health Benefits Of Sitting On The Floor And Eating: కింద కూర్చుని తింటే..  బరువు తగ్గుతారా..? - know the health benefits of sitting on the floor and  eating​ - Samayam Telugu

మనం సుఖాసనంలో కూర్చున్నప్పుడు పాదలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. అదనపు రక్తాన్ని గుండె ద్వారా ఇతర అవయవాలకు ప్రసారం చేయడం ప్రారంభిస్తుంది. ఇది జీర్ణక్రియకు అవసరమైన కార్యచరణను పెంచుతుంది. అలాగే టెన్షన్‌ని దూరం చేసి మనసును ఏకాగ్రతతో పాటు పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Eating
  • food
  • health
  • Life Style
  • weight loss

Related News

Coffee

కాఫీ తాగితే న‌ష్టాలే కాదు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయ‌ట‌!

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పానీయాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి టెలోమెర్స్‌కు మేలు చేస్తాయి. కాఫీతో పాటు గ్రీన్ టీ, కొన్ని పండ్ల రసాల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి.

  • Sitting Risk

    ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల కలిగే అనర్థాలివే!

  • Pneumonia

    ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

  • Vitamin D3 Symptoms

    అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

  • Harmed Food

    మ‌న శ‌రీరంలోని అవయవాలకు హాని కలిగించే ఆహారాల లిస్ట్ ఇదే!

Latest News

  • ఆ 10 డెంటల్ కళాశాలలపై రూ.100 కోట్ల జరిమానా? సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

  • బీజేపీలో చేరనున్న టాలీవుడ్ సీనియర్ నటి

  • గదిలో ప్రియుడితో ఏకాంతగా గడుపుతున్న యువతి, సడెన్ గా తండ్రి ఎంట్రీ

  • ఏనుగుల గుంపును ఢీ కొన్న రైలు , ఏనుగులు మృతి

  • సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలనం

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd