Summer Skin Care: ఎండలో ఆఫీసులకు వెళ్తున్నారా.. అయితే మీ చర్మం పాడవకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే?
వేసవికాలంలో ఎండలో అలాగే ఆఫీస్ లకు వెళ్లేవారు చర్మం పాడవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని రెమెడీస్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:34 PM, Tue - 25 March 25

మామూలుగానే స్త్రీలు చర్మ సౌందర్యం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఇక వేసవి కాలంలో తీసుకునే జాగ్రత్తల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వేసవికాలంలో కూడా తప్పనిసరిగా ఆఫీసులకు వెళ్లి పని చేసుకోవాల్సిందే. ఇందుకోసం ఎండలోకి వెళ్లక తప్పదు. అలాంటప్పుడు స్కిన్ గురించి చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఎన్ని క్రీములు రాసినప్పటికీ సూర్యరశ్మి తగలడం వల్ల చర్మం నిర్జీవంగా మారిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటించాలని చెబుతున్నారు..
కాగా సూర్యుడి నుంచి విడుదలయ్యే యూవీ కిరణాల కారణంగా చాలా మందికి మహిళలకు చర్మం టాన్ అయిపోతుందట. ఎండ కారణంగా వచ్చే చెమటతో పాటు ప్రయాణ సమయలంలో కాలుష్యం, దుమ్ము, ధూళి వంటివన్నీ కలిసి చర్మాన్ని పూర్తిగా దెబ్బ తీస్తాయట. ఫలితంగా మొటిమలు, చిన్న చిన్న పొక్కులు, దద్దుర్లు, దురద వంటి అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే, అలాగే వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, ఎండ కారణంగా వచ్చే చర్మపు మంట లేదా సన్‌బర్న్ వంటి వాటిని నయం చేయడానికి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం చాలా అవసరం అని చెబుతున్నారు. చర్మంపై ఉండే మృతకణాలను, ధూళి, నూనె వంటి ఇతర మలినాలను తొలగించడాన్ని ఎక్స్‌ఫోలియేషన్ అంటారు. ఎక్స్ ఫోలియేషన్ ప్రకియ తర్వాత చర్మం చాలా ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపిస్తుందట. అలాగే మృదుత్వం పెరుగుతుందట. మొటిమలు, నల్లటి మచ్చలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. అలా అని రోజూ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం కూడా చర్మాన్ని దెబ్బతీస్తుందట. వేసవిలో వారానికి ఒకసారి మాత్రమే చేయడం మంచిదని చెబుతున్నారు.
సూర్యుడి కిరణాల ద్వారా విడుదలయ్యే అధిక UV ఎక్స్‌పోజర్ మీ చర్మానికి హాని కలిగిస్తుంది. దానివల్ల సన్‌బర్న్, ముడతలు, చిన్న చిన్న గీతలతో పాటు వృద్ధాప్య లక్షణాలు పెరుగుతాయట. వీటి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి SPF 30 ఉన్న UV స్పెక్ట్రమ్ ఉన్న సన్‌బ్లాక్ లేదా సన్‌స్క్రీన్ ఉపయెగించాలని చెబుతున్నారు. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్ళే బయటకు కనిపించే చర్మం మొత్తానికి దీన్ని అప్లై చేసుకుని వెళ్ళాలట.
అలాగే వేసవి నెలల్లో మేకప్ తగ్గించాలని అవుతున్నారు. అలాగే వీలైనంత వరకూ మేకప్ కు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఎండాకాలంలో మీ చర్మానికి గాలి ఎక్కువ అవసరం అవుతుంది. మేకప్ చర్మానికి గాలి తగలకుండా అడ్డుకుంటుందట. కాబట్టి వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పుడు మేకప్ వేయకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఒకవేళ వేయాల్సి వచ్చినప్పుడు మినరల్ ఆధారిత మేకప్ వేయడానికి ప్రయత్నించడం మంచిదట.
అలాగే వేడి, తేమతో కూడిన వేసవి రోజుల్లో చర్మాన్ని కాపాడుకునేందుకు కూలింగ్ మిస్ట్ అద్భుతంగా పనిచేస్తుందట. ఇది సన్‌బర్న్, చర్మపు వాపు వంటి సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు కూలింగ్ మిస్ట్ మీ చర్మాన్ని తాజాగా, మెరుస్తూ ఉంచుతుందట. మీరూ ఎండలో ఆఫీసులకు వెళుతున్నట్లయితే దీన్ని తప్పకుండా ఉపయోగించాలని చెబుతున్నారు.