Betel Leaf Tips : వామ్మో.. తమలపాకు ఎక్కువగా తీసుకుంటే అలాంటి వ్యాధులు వస్తాయా!
తమలపాకు (Betel Leaf) కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
- By Naresh Kumar Published Date - 05:30 PM, Sat - 16 December 23

Betel Leaf Benefits and Tips : హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా తమలపాకుని తప్పకుండా వినియోగిస్తూ ఉంటారు. తమలపాకు (Betel Leaf) కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చాలామంది తమలపాకుని కిల్లి రూపంలో కూడా తింటూ ఉంటారు. అయితే తమలపాకును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే కానీ శృతిమించి తీసుకుంటే మాత్రం అనేక రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు. మరి తమలపాకును (Betel Leaf) ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
తమలపాకులు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల ఆసమతుల్యత ఏర్పడి తీవ్ర వ్యాధులకు కారణమవుతూ ఉంటుంది. మరి తమలపాకుల వల్ల కలిగే నష్టాల విషయానికి వస్తే.. తమలపాకులు అధికంగా తినడం వలన నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్లో దొరికే పాన్ లో కూడా పొగాకు కలుస్తుంది. ఇది హానికరమైంది కావడంతో నోటి క్యాన్సర్ సమస్య వస్తుంది. పాన్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమల్యుత వస్తుంది. తమలపాకు అధికంగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు కూడా వస్తాయి. ఇది థైరాయిడ్ హార్మోన్ ని పెంచడం లేదా తగ్గించడం జరుగుతుంది. తమలపాకులను అధికంగా తినడం వలన గర్భధారణపై ఎఫెక్ట్ పడుతుంది.
ఇది గర్భంలో పిండం దాని అభివృద్ధిపై ఎఫెక్ట్ ని చూపిస్తుంది. తమలపాకును అధికంగా తినడం వలన చర్మ అలర్జీలు వస్తాయి. ఫలితంగా చర్మంపై దురదలు, దద్దుర్లు వచ్చి ఎర్రగా మారుతూ ఉంటాయి. అలాగే తమలపాకులు అధికంగా తింటే హైబీపీ సమస్య వస్తుంది. ఇది అధిక రక్తపోటు అసాధారణ హృదయ స్పందనలకు దారితీస్తూ ఉంటుంది. దీనిని కారణంగా శరీర ఉష్ణోగ్రత అధికమయ్యేలా చేస్తుంది. తమలపాకును ఎక్కువ తీసుకోవడం వల్ల చిగుళ్లలో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి. అలాగే తీవ్రమైన నొప్పితో పాటు చిగుళ్ళు దవడలలో వాపు వచ్చి నొప్పి అధికమయ్యేలా చేస్తుంది.
Also Read: Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం