Weight loss Tips: వేగంగా బరువు తగ్గాలంటే ఈ టీ తాగాల్సిందే.. అదేంటో తెలుసా?
ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీ, పురుషులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ అధిక బరువు సమస్య కారణంగా ఎటువంటి పనులు చేయలేక ఇబ్బంది పడుత
- By Nakshatra Published Date - 06:10 PM, Wed - 17 May 23

ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీ, పురుషులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ అధిక బరువు సమస్య కారణంగా ఎటువంటి పనులు చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అధికబరువును తగ్గించుకోవడం కోసం నిత్యం ఎన్నో రకాల వ్యాయామాలు, ఎక్సర్ సైజులు, ఎన్నో రకాల చిట్కాలను పాటించినప్పటికీ ఫలితం లేదని బాధపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా స్త్రీలు అధిక బరువు సమస్యతో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.
మరి స్త్రీ,పురుషులు తొందరగా బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయితే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టేందుకు పుదీనా టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషక పదార్ధాలతో చాలా సమస్యలను తగ్గించవచ్చు. పసుపు-పుదీనా టీ తాగడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. ఈ టీ శరీరంలో ఉండే కొవ్వును వేగంగా తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే నిద్రేలేమి సమస్యను దూరం చేసేందుకు పుదీనా పసుపు టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ టీని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
పసుపు-పుదీనా టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పసుపులో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. ఇవి ఇమ్యూనిటీని పటిష్టం చేస్తాయి. దీంతో తలనొప్పి, జలుబు వంటి సీజనల్ సమస్యలు దూరమౌతాయి. పుదీనా-పసుపు టీ తాగడం వల్ల శరీరంలో ఇన్‌ఫెక్షన్ సమస్య కూడా దూరమౌతుంది. శ్వాస నుంచి వచ్చే చెడు వాసనను దూరం చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పుదీనా-పసుపు టీ బాగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం వల్ల చాలాసేపటి వరకూ నోట్లో ఫ్రెష్ నెస్ ఉంటుంది. అందుకే నోటి చెడు వాసనను దూరం చేసేందుకు చాలామంది పుదీనా-పసుపు టీ తాగమని సలహా ఇస్తుంటారు. కాగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు పుదీనా పసుపు టీ క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే కేవలం 5 నుంచి 6 వారాల్లో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

Related News

Alcohol: టీ, కాఫీ తాగితే మద్యం మత్తు దిగుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
సాధారణంగా అతిగా మద్యం సేవించిన వారిని మతిస్థిమితం లేని వారు అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే మద్యం సేవించినప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో ఎల