Weight loss: హెల్త్ సీక్రెట్ : భర్త డైట్ ప్లాన్.. 31 కేజీల బరువు తగ్గిన భార్య!!
ప్రెగ్నెన్సీ సమయంలో .. మహిళలు బరువు పెరగడం సహజమే. ఆ టైంలో శారీరక శ్రమకు దూరంగా ఉండటం, తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం వల్ల బరువు పెరిగి పోతుంటుంది.
- By Hashtag U Published Date - 06:15 AM, Tue - 2 August 22
ప్రెగ్నెన్సీ సమయంలో .. మహిళలు బరువు పెరగడం సహజమే. ఆ టైంలో శారీరక శ్రమకు దూరంగా ఉండటం, తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం వల్ల బరువు పెరిగి పోతుంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత వ్యాయామం, తగిన డైటింగ్ చేస్తే మళ్ళీ మునుపటిలా ఫిట్ నెస్ ను పొందొచ్చు. దీన్ని సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఫిట్నెస్ మమ్మి. ఆమె అసలు పేరు హర్మన్ సిద్ధు. పంజాబ్ లోని మొహాలి వాస్తవ్యురాలు. వృత్తిరీత్యా ఆమె కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్. ప్రెగ్నెన్సీ తర్వాత ఆమె బరువు 84 కిలోలు..ఆ తర్వాత డైట్ ప్లాన్, వ్యాయామం చేసి హర్మన్ సిద్ధు 31 కిలోలు బరువు తగ్గారు. ఈ అచీవ్మెంట్ వివరాలు ఆమె మాటల్లోనే..
బరువు చూసి షాక్..
“పెళ్లికి ముందు నేను చాలా స్లిమ్‌గా ఉండేదాన్ని. నా బరువు 45 కిలోల లోపు ఉండేది. కానీ నేను గర్భవతి అయినప్పుడు, నా బరువు ప్రతి నెలా 4-5 కిలోలు పెరిగింది. సి-సెక్షన్ ద్వారా ఆడపిల్ల పుట్టింది.
‘ముందు బరువు యంత్రం తీసుకురండి, నేను నా బరువును చెక్ చేసుకోవాలి.’ అని నేను రెండు రోజుల తర్వాత నా భర్తకు చెప్పాను.ఆ తర్వాత మెషిన్ తీసుకొచ్చి చూసేసరికి నా బరువు 83 కేజీలు. బరువు చూసి షాక్ అయ్యి ఏడవడం మొదలుపెట్టాను. నేను వాటర్ వెయిట్ పట్టుకున్నాను కాబట్టి కంగారు పడాల్సిన పని లేదని నా భర్త వివరించారు” అని హర్మన్ వివరించారు.
బరువు పెరిగిందనే డిప్రెషన్లో..
హర్మాన్ ఇంకా మాట్లాడుతూ.. “నేను ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చినప్పుడు, శిశువుకు తినిపించడం, డైపర్లు మార్చడం, జాగ్రత్తలు తీసుకోవడం మొదలైన పనుల వల్ల చిరాకు పడ్డాను. బరువు పెరిగిందనే డిప్రెషన్లో జీవించడం ప్రారంభించాను. వైద్య శాస్త్రంలో దీనిని పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అంటారు. అదొక రకమైన మానసిక అనారోగ్యం. ప్రసవానంతర డిప్రెషన్ నుండి బయటపడేందుకు నాకు మూడు నెలలు పట్టింది. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఈక్రమంలో వృత్తి రీత్యా ఫిట్నెస్ కోచ్ అయిన నా భర్త సహాయం చేశాడు. నేను తొలుత ఇంట్లో రోజూ గంటన్నర పాటు జిమ్ చేసేదాన్ని. ఆ తర్వాత జిమ్ కి వెళ్లడం మొదలుపెట్టాను. జిమ్ చేసే సమయాల్లో మా పాపను నా భర్తే చూసుకునేవారు. ఆయన సహకారం లేనిది నేను వెయిట్ లాస్ టార్గెట్ సాధించేదాన్ని కాదు.ఈరోజు నా బరువు 53కిలోలు ఉంది. నేను మొదటి 3 నెలల్లో 16 కిలోల బరువు కోల్పోయాను. కానీ కండరాలను టోన్ చేయడానికి సమయం పట్టింది. మొత్తం 31 కిలోల బరువు తగ్గడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది” అని వివరించారు.
మెనూ సీక్రెట్..
“నా డైట్ లో భాగంగా తీసుకున్న ఆహార పదార్థాలన్నీ ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మా ఆయన చెప్పిన ప్రకారమే డైట్ ప్లానింగ్ జరిగింది. రోజూ 1 గ్లాసు పాలు, 5 బాదంపప్పులు, 4 గుడ్లు, గుడ్డు తెల్లసొన 1 , 5 గ్రాముల వెన్న లేదా నెయ్యి ,200 గ్రాముల చికెన్ బ్రెస్ట్ (రెండు పూటలు), 100 గ్రాముల బియ్యం, ఉడికించిన కూరగాయలు, పెరుగు తింటున్నాను” అని వివరించారు.
Related News
Weight Loss: లవంగాలు కూడా బరువును తగ్గిస్తాయా..? ఎలాగో తెలుసా..?
ఖాళీ కడుపుతో వివిధ రకాల పండ్లను, ఇతర ఆహార పదార్థాలను మీరు తరచుగా చూడవచ్చు.